కొక్కుల పద్మావతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొక్కుల పద్మావతి
జననంకొక్కుల పద్మావతి
మే 5, 1958
India నాగపూర్, మహారాష్ట్ర
నివాస ప్రాంతంకరీంనగర్, తెలంగాణ
వృత్తికథా రచయిత, అనువాదకురాలు.

కొక్కుల పద్మావతి ( మే 5, 1958) కథా రచయిత్రి, అనువాదకురాలు.

జననం[మార్చు]

కొక్కుల పద్మావతి 1958 మే 5నాగపూర్లో జన్మించింది. ప్రస్తుతం కరీంనగర్ లో స్థిరపడింది.[1] ఆమె పాఠశాల విద్యనంతా మరాఠీ మీడియంలో చదివి, వివాహానంతరం అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ నుంచి తెలుగులో డిగ్రీ చేసింది. మరాఠీ కథలు చదవటమంటే ఆమెకు చాలా ఇష్టం. అదే స్థాయిలో తెలుగు కథలపై కూడా అభిమానాన్ని పెంచుకొని, మరాఠీ నుంచి తెలుగు భాషలోకి కథలను అనువాదం చేయటం ప్రారంభించింది. అందులో ముఖ్యంగా పేర్కొనదగినవి ”విహార్‌”, ”అతనికథ”, అంతేగాక ”పాలమీగడ”, ”ప్రశంస” వంటి స్వతంత్ర కథలను కూడా రచిందింది. [2]

జీవిత విశేషాలు[మార్చు]

కొక్కుల పద్మావతి మరాఠీ మాతృభాష. హింది, తెలుగు, మరాఠీ భాషల్లో ఒక భాష నుండి మరో భాషకు కథలు అనువాదాలు చేస్తారు. ఈమె కథలు వార్త, ఆంధ్రజ్యోతి, విపుల ప్రత్రికల్లో ప్రచురించబడ్డాయి.

రచనలు[మార్చు]

  • అతన్నిచదివించండి
  • కార్మికుడి భార్య
  • కార్మికుని భార్య

మూలాలు[మార్చు]

  1. కొక్కుల పద్మావతి. "రచయిత: కొక్కుల పద్మావతి". kathanilayam.com. Retrieved 19 October 2017.[permanent dead link]
  2. "బహుజన స్త్రీల కథా సాహిత్యం".