కొట్రికె మధుసూదన గుప్తా
స్వరూపం
కొట్రికె మధుసూదన గుప్తా | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2014 | |||
తరువాత | ఆర్.జితేంద్ర గౌడ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | గుంతకల్లు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1968 జూన్ 30 అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జనసేన | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | కొట్రికె పద్మనాభయ్య శెట్టి |
కొట్రికె మధుసూదన గుప్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గుంతకల్లు నియోజకవర్గం నుండి 2009లో ఎమ్మెల్యేగా గెలిచాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కొట్రికె మధుసూదన గుప్తా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పాటైన గుంతకల్లు నియోజకవర్గం నుండి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ దూరంగా ఉండి 2018లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. కొట్రికె మధుసూదన గుప్తా 2019లో జనసేన పార్టీ లో చేరి 2019లో గుంతకల్లు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (15 November 2013). "గుంతకల్ ఎమ్యెల్యేకు సమైక్య సెగ". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
- ↑ Sakshi (23 March 2019). "ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల వీరే..!". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.