కొడగనూర్ ఎస్.గోపీనాథ్
డాక్టర్ కొడగనూర్ ఎస్. గోపీనాథ్, ఎంఎస్, ఎఫ్ఎఎంఎస్, ఎఫ్ ఆర్ సిఎస్ (ఎడిన్) సర్జికల్ ఆంకాలజిస్టు. క్యాన్సరు పరిశోధన పరంగా తాను చేసిన మార్గనిర్దేశకత్వ కృషికి ప్రసిద్ధి చెందాడు. దేశంలో వైద్యపరంగా అత్యున్నత గౌరవంగా పరిగణించబడే డాక్టర్. బి. సి. రాయ్ అవార్డుతో సహా అనేక పురస్కారాలను అందుకున్నాడు. [1] 2010లో భారత ప్రభుత్వం ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ని ప్రదానం చేసింది. [2]
జీవిత చరిత్ర
[మార్చు]కొడగనూర్ ఎస్. గోపీనాథ్ కర్ణాటకలోని దావణగెరె అనే చిన్న పట్టణంలో జన్మించాడు. అతను సెయింట్ పాల్స్ కాన్వెంట్ పాఠశాలలో తన పాఠశాల విద్య చదివాడు. 1968 లో దావణగెరె లోని జెజెఎం మెడికల్ కాలేజీలో చేరాడు. 1975 లో మూడవ ర్యాంకుతో ఎంబిబిఎస్ డిగ్రీ సాధించాడు. ముంబై లోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్, సేఠ్ గోవర్ధన్‌దాస్ సుందర్ దాస్ మెడికల్ కాలేజిలో సాధారణ శస్త్రచికిత్స (ఎంఎస్)లో ఎమ్మెస్ చేశాడు. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ నుండి ఎఫ్.ఆర్.సి.ఎస్, న్యూ ఢిల్లీ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎఫ్.ఎ.ఎం.ఎస్ పొందాడు. డాక్టర్ గోపీనాథ్ బెంగళూరులోని కిద్వాయ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో సర్జికల్ ఆంకాలజిస్ట్ గా చేరాడు.
డాక్టర్ గోపీనాథ్ కళాశాల లెక్చరర్ కుసుమ్‌ను పెళ్ళి చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె సింధూర ఉన్నారు. ఈ కుటుంబం బెంగళూరులో నివసిస్తోంది. శ్రీనివాస్ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్‌లో థొరాసిక్ ఆంకాలజీ ఫెలోగా ఉన్నాడు. సింధూర న్యూయార్క్ నగరంలోని మౌంట్ సినాయ్‌లోని ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో క్యాన్సర్ బయాలజీలో పీహెచ్‌డీ చేస్తోంది. [3]
అవార్డులు, గుర్తింపులు
[మార్చు]- ప్రొఫెసర్ బి జి జిర్జ్ మెమోరియల్ ఒరేషన్ - 2018
- ప్రొఫెసర్ కెపి భార్గవ్ మెమోరియల్ అవార్డు - 2013
- పద్మశ్రీ – 2010
- డాక్టర్. బి. సి. రాయ్ అవార్డు – 2008
- రాజోయ్సవ పురస్కారం – 2005
- అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ "The Hindu : Karnataka / Bangalore News : Two Bangalore doctors get B.C. Roy Award". web.archive.org. 2008-07-05. Archived from the original on 2008-07-05. Retrieved 2022-01-18.
- ↑ "View source for Kodaganur S. Gopinath - Wikipedia". en.wikipedia.org (in ఇంగ్లీష్). Retrieved 2022-01-18.
- ↑ "Kodaganur S. Gopinath - Director, Consultant of Surgical Oncology in Bengaluru, Karnataka, India | eMedEvents". eMedEvents.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-18.