కొమరవోలు (నిజాంపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొమరవోలు గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 314., ఎస్.టి.డి.కోడ్ = 08648.

కొమరవోలు(నిజాంపట్నం)
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నిజాంపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 262
ఎస్.టి.డి కోడ్ 08648

ఈ గ్రామం ఆముదాలపల్లి గ్రామానికి ఒక శివారు గ్రామం. రేపల్లెకు 19 కిలోమీటర్ల దూరమున ఉంది. ఇది నిజాంపట్నంకు 6 కిలోమీటర్ల దూరమున ఉంది.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ కామేశ్వరమ్మ వార్ల ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో, 2015,మార్చి-4వ తేదీ బుధవారం నుండి నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, 5వ తేదీ గురువారం, ఫాల్గుణ పౌర్ణమిరోజు ఉదయం నూతన వసతిగృహ ప్రవేశం, మండప దేవతా పూజలు, నవగ్రహాది అనిష్టానాలు, పంచగవ్యాధివాసం, పంచామృతాద్ధివాసములు, హోమాలు నిర్వహించారు. మూడవ రోజు శుక్రవారం ఉదయం, మండప దేవతా పూజలు,అనుష్టానములు, ధాన్యాదివాసం, హోమాలు నిర్వహించారు. ఐదవ రోజు ఆదివారం ఉదయం, మండప దేవతాపూజలు, ప్రతరౌపాసన హోమాలు నిర్వహించారు. నవగ్రహాల ధ్వజస్తంభ ప్రతిష్ఠలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. [2]

  • పై కార్యక్రమాలలో భాగంగా, ఆలయ ప్రాంగణంలో, ఒక నాపరాయిని తొలగించు చుండగా, రాయిపైనా, క్రిందభాగాలలో నాగేంద్రస్వామి ప్రతిమలు కనిపించినవి. భక్తులు ఆశ్చర్యానికి గురై ప్రత్యేకపూజలు నిర్వహించారు. [1]

గ్రామ విశేషాలు[మార్చు]

  1. వ్యవసాయం, కల్లుగీత, పశువులపెంపకం ఇక్కడివారి ముఖ్యమైన వృత్తులు. 2014 నాటికి 1000 జనాభాను దాటినది.పెద్దరేవు, చిన్నరేవు కలిసేచోటు ఈ ఊరిలోనే ఉంది.కురాలమ్మ, కామేశ్వరమ్మ ఈ ఊరి గ్రామదేవతలు.
  2. ఈ గ్రామంలో ఓ గాథ ఉంది.. పూర్వం కుమ్మరి వారు ఓ దిబ్బ మీద ఉండేవారట... కాల గమనంలో.. ఆ దిబ్బ తిరగబడి.. అప్పటి ఊరంతా. బూమీలోకి పోయిందట.. (భూమి తిరగబడింది అంటారు ఇక్కడి వాళ్ళూ).. ఆ దిబ్బమీదకు పోయి.. పరిశిలిస్తే. ఐదు పైసల బిళ్ళ పరిమాణంలో.. కుండ పెకుంలు ఆ ఇసుక నిండా.. ఆ దిబ్బల మీద ఇప్పటికీ చూడవచ్చు.