కొమ్మూరు (రాజగోపాలపురం)
కొమ్మూరు (రాజగోపాలపురం) | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 16°39′11.23″N 80°52′35.80″E / 16.6531194°N 80.8766111°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ఏలూరు |
| మండలం | ఆగిరిపల్లి |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( ) |
| పిన్‌కోడ్ | 521212 |
కొమ్మూరు ఏలూరు జిల్లా, అగిరిపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ చరిత్ర
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు
[మార్చు]విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
అగిరిపల్లె మండలం
[మార్చు]అగిరిపల్లె మండలం మొత్తంతో పాటు పట్టణ పరిధిలో ఉన్న ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామ భౌగోళికం
[మార్చు]ఇది సముద్రమట్టానికి 24 మీ.ఎత్తులో ఉంది.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]నూజివీడు, మైలవరం, గన్నవరం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 28 కి.మీ
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కె.రంగమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]కొమ్మూరు గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలోని గంగానమ్మ, పోతురాజుల విగ్రహాల పునఃప్రతిష్ఠాకార్యకమం, 2014,డిసెంబరు-15, సోమవారం నాడు ఉదయం 8 గంటలకు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
