Jump to content

కొవ్వు పదార్ధాలు

వికీపీడియా నుండి
ట్రైగ్లిజరైడ్ నిర్మాణం.

కొవ్వులు, కొవ్వు పదార్ధాలు అనే తెలుగు మాటలని రసాయన శాస్త్ర పరిభాషలో fats, lipids అనే ఇంగ్లీషు మాటల స్థానంలో వాడుతూ ఉంటారు. అసలు ఇంగ్లీషు వాడకం లోనే సామాన్యులు చాలామంది 'fats', 'lipids' అన్న మాటల మధ్య అర్ధ వ్యత్యాసం లేనట్లు వాడెస్తూ ఉంటారు. కాని శాస్త్ర పరంగా 'fats', 'lipids' అన్న మాటలలోని అర్ధాలలో తేడా ఉంది. ఇటువంటి సూక్ష్మాలని గమనించి మాటలు వాడటం వల్లనే శాస్త్రానికి నిర్ధిష్టత వస్తుంది. లిపిడ్స్‌ అనే పదార్ధాలు ఒక సమితి (set) అనుకుంటే, ఫేట్స్‌ అనేవి ఆ సమితిలో ఒక ఉప సమితి (sub set) మాత్రమే. కనుక తెలుగులో ఈ రెండింటికి ఒకే మాట వాడటం సబబు కాదు.

రకాలు

[మార్చు]

కొవ్వులు (లిపిడ్‌లు) మరో ముఖ్యమైన జీవ రసాయనాలు. ద్రవరూపంలోని కొవ్వులను నూనెలు అంటారు. ఆహార నిల్వలుగా మాత్రమే కీలకమైన క్రియాశీల చర్యలను ఇవి నిర్వహిస్తాయి. కొవ్వులు సాధారణంగా నాలుగు రకాలు. అవి..

  1. సరళకొవ్వులు. ఉదా: వంటనూనె
  2. సంక్లిష్ట కొవ్వులు. ఉదా: పాస్ఫో లిపిడ్‌లు, స్ఫింగో లిపిడ్‌లు,
  3. మైనపు పదార్థాలు,
  4. ఉత్ప్రేరక కొవ్వులు. ఉదా: స్టిరాయిడ్‌లు.

సరళ కొవ్వుల్లో గ్లిసరాల్, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు రెండు రకాలు అవి.. సాచురేటెడ్, అన్‌సాచురేటెడ్. కొవ్వు ఆమ్లంలోని కార్బన్‌లన్నింటి మధ్య ఏకబంధాలు ఏర్పడితే అవి సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు.

ఉదా: పామిటిక్, స్టియరిక్ ఆమ్లాలు. కార్బన్‌ల మధ్య ద్విబంధాలు లేదా త్రిబంధాలు ఏర్పడితే వాటిని అన్‌సాచురేటెడ్ కొవ్వు ఆమాలు అంటారు. ఉదా: లినోలిక్, ఓలిక్ కొవ్వు ఆమ్లాలు. కొలెస్టరాల్ ఒక ముఖ్యమైన సంక్లిష్ట కొవ్వు. దాని నుంచి శరీరంలో అనేక స్టిరాయిడ్ హార్మోన్లు తయారవుతాయి. ఆహారంలో సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ఉంటే రక్తంలో చే డు కొలెస్టరాల్ పేరుకొని గుండె పనితీరు దెబ్బ తింటుంది. అన్‌సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

నిఘంటు అర్థం

[మార్చు]

నిఘంటువులో fat అనే మాటకి కొవ్వు, గోరోజనం, మేద, మదం, కావరం, పోతరం, హామిక అన్న అర్ధాలు ఉన్నాయి. వీటిలో fat అనే మాటకి 'కొవ్వు' అనే అర్థం స్థిరపడిపోయింది కనుక ఆ మాటని వదలి పై జాబితాలో ఉన్న మరే మాటని అయినా lipid అనే మాటకి సమానార్ధకంగా తీసుకోవచ్చు. కొవ్వు అన్న మాటతో ప్రాస కుదురుతుంది కనుక lipid = కావరం అని ప్రయోగించి చూడవచ్చు. అప్పుడు 'fats and lipids' అనే పదబంధాన్ని 'కొవ్వులు, కావరాలు' అని తెలిగించి చూడవచ్చు. లోగడ lipids ని 'గోరోజనాలు' అని తెలిగించినవారు ఉన్నారు.

నిర్వచనం

[మార్చు]
లావెక్కిన ఎలుక ఎడమవైపు, కుడివైపు మామూలు ఎలుక పోలిక కోసం.

స్థూలంగా నిర్వచించాలంటే కావరాలు (lipids) కొవ్వు పదార్ధాలలో కరిగే, సహజసిద్ధంగా దొరికే బణువులు (molecules). ఉదాహరణకి కొవ్వులు (fats), నూనెలు (oils), మైనాలు (waxes), కొలెస్టరాల్‌ (cholesterol), కొవ్వులో కరిగే విటమినులు (అనగా విటమిన్‌ A, D, E, K లు), మోనోగ్లిసరైడ్‌లు, డైగ్లిసరైడ్‌లు, ట్రైగ్లిసరైడ్లు, మొదలగునవి. మరొక కోణం ద్వారా వివరించాలంటే 'కొవ్వు పదార్ధాలు ట్రైగ్లిసరైడ్లు అనే పేరుగల కావరాలు.' కావరాలు శరీరంలో ముఖ్యంగా మూడు పనులు చేస్తాయి: శక్తిని నిల్వ చెయ్యటం (storage of energy), కణ కవచం (cell membrane) యొక్క నిర్మాణంలో తోడుపడటం, వార్తలని మోసుకెళ్ళే ప్రక్రియలో సహాయపడటం. కావరాలు నీటిలో కరుగవు; కానీ బెంజీన్, ఈథర్, క్లోరోఫామ్ మొదలైన వాటిలో కరుగుతాయి. ఇవి ఆహర పదార్ధాలలోని ముఖ్యమైనవి. కొవ్వు పదార్ధాలు శక్తి నిల్వ పదార్ధాలుగ పనిచేస్తాయి.

వర్గీకరణ

[మార్చు]

కావరాలని స్థూలంగా రెండు వర్గాలుగా విడగొట్టవచ్చు: నీరంటే విముఖత చూపేవి (hydrophobic) ఒక వర్గం, నీరంటే సుముఖత, విముఖత రెండూ ఒకేసారి చూపేవి (ambiphilic) రెండో వర్గం. ఇక్కడ hydro అంటే నీరు. phobia అంటే భయం, కిట్టకపోవటం, ఇష్టం లేకపోవటం. మనకి పరిచయం ఉన్న నూనెలు, నేతులు, చాల వరకు నీళ్ళల్లో కలవవు - అంటే వాటికి నీళ్ళంటే 'ఇష్టం' లేదన్న మాట. నీటితో సఖ్యత చూపటం లేదన్న మాట. అలాగే ambi అంటే రెండు విరుద్ధ భావాలపై ఎటూ మొగ్గు చూపకపోవటం. ఈ ధోరణిలో ఆలోచించుకుంటూ వెళితే కావరాలలో ఎనిమిది జాతులని గుర్తించి, ఒకొక్క జాతిని ప్రత్యేకంగా అధ్యయనం చెయ్య వచ్చు.

పోషక లక్షణాలు

[మార్చు]

శరీర పోషణలోనూ, ఆరోగ్య పరిరక్షణలోనూ కావరాలు చాల కీలమైన పాత్ర వహిస్తాయి. కొన్ని కావరాలు మన మనుగడకే అత్యవసరం. మరికొన్ని కావరాలు మోతాదు మించితే ఆరోగ్యాన్ని పాడుచేసి రోగకారకాలు అవుతాయి. ఉదాహరణకి కోలెస్టరాల్‌ (cholesterol), అడ్డుకొవ్వు ఆమ్లాలు (trans-fatty acids) మోతాదు మించితే గుండెజ్బ్బు కలుగజేస్తాయని శాస్త్రవేత్తల తీర్మానం.

మానవుల మనుగడకి కొన్ని రకాల కొవ్వు ఆమ్లాలు అత్యవసరం (essential fatty acids). ఉదాహరణకి లినోలియిక్‌ ఆమ్లం (ఇది ఒమేగా-6 జాతి కొవ్వు ఆమ్లం), ఆల్ఫా-లినోలియిక్‌ ఆమ్లం (ఇది ఒమేగా-3 జాతి కొవ్వు ఆమ్లం) అనే రెండు పదార్ధాలూ ఉన్న ఆహారం మనం తిని తీరాలి; ఎందుకంటే మన శరీరాలు వీటిని తయారు చేసుకోలేవు. చాల శాకాలనుండి లభించే నూనెలలో (ఉ. సేఫ్లవర్‌ నూనె, సూర్యకాంతం గింజల నూనె, మొక్కజొన్న నూనె) ఈ లినోలియిక్‌ ఆమ్లాలు ఉంటాయి. అదే విధంగా చాల రకాల ఆకు కూరలలోనూ, పప్పులలోనూ (ఉ. సోయా చిక్కుడు, కనోలా, ప్లేక్స్‌) గింజలు (seeds) లోనూ, పిక్కలు (nuts) లోనూ ఆల్ఫా-లినోలియిక్‌ ఆమ్లం ఉంటుంది. దసాయన బణునిర్మాణ కోణంలో చూస్తే ఈ రెండు రకాల ఆమ్లాల లోనూ (అనగా, లినోలియిక్‌ ఆమ్లం, ఆల్ఫా-లినోలియిక్‌ ఆమ్లం ) ఒకొక్క బణువులో 18 కర్బనపు అణువులు ఉన్నాయి; తేడా అల్లా ఎన్నెన్ని జంట బంధాలు (double bonds) ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయంలోనే. కొన్ని చేప నూనె () లలో ఇంకా పొడవాటి కర్బనపు గొలుసులు ఉన్న ఒమేగా-6 జాతి కొవ్వు ఆమ్లాలు - eicosapentaenoic acid (EPA) and docosahexaenoic acid (DHA) - ఉంటాయి.

జీవులలో కొవ్వు ప్రాముఖ్యత

[మార్చు]
  • కొన్ని విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E,, విటమిన్ K కొవ్వులో కరుగుతాయి. అంటే వీటిని జీర్ణించుకోవడానికి, రవాణాకు కొవ్వు చాల అవసరం. కొవ్వులు మన శరీరానికి అత్యవస్రమైన కొవ్వు అమ్లాలను అందిస్తాయి.
  • కొవ్వు మన శరీరానికి ఇన్సులేషన్ లాగా పనిచేస్తుంది. ఇది బయటి షాక్ నుండి రక్షిస్తుంది.
  • శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉపయోగపడుతుంది.
  • ఇవి మనకు ముఖ్యమైన శక్తి స్థావరాలు. వీటి విచ్ఛిన్నం వలన గ్లిసరిన్ లేదా గ్లిసరాల్, స్వతంత్ర కొవ్వు ఆమ్లాలు విడుదలవుతాయి. గ్లిసరాల్ కాలేయంలో గ్లూకోస్గా మారుతుంది.

వ్యాధులు

[మార్చు]
  • కొవ్వుకు సంబంధించిన ట్యూమర్ లను లైపోమా, లైపోసార్కోమా అంటారు.
  • కొవ్వు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దెబ్బ తగలడం వలన అక్కడ ఉన్న కణజాలం చనిపోయి, గడ్డలుగా తయారవుతాయి. ఇవి ముఖ్యంగా రొమ్ములో కాన్సర్ గడ్డలను భ్రమింపజేస్తాయి. క్లోమమునకు సంబంధించిన వ్యాధులలో పెప్సిన్, లైపేజ్ మొదలైన ఎంజైములు ఉదరములోకి విడుదలయి, అందువల్ల లోపలి కొవ్వు కరిగిపోయి ప్రమాదమైన పరిస్థితి కలుగుతుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

లంకె లంకెపేరు