కోగంటి విజయలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోగంటి విజయలక్ష్మి ప్రముఖ నవలా రచయిత్రి. ఈమె 1946లో జూలై 29న జన్మించారు. ఈమె తండ్రి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కోగంటి రాజబాపయ్య, తల్లి శకుంతలాదేవి. 40 ఏళ్లకు పైగా సాహితీవ్యాసంగాన్ని కొనసాగించిన ఈమె ఎన్నో నవలలు రాశారు. ఈమె ఆయుర్వేద వైద్యురాలు. ఈమె వివాహం చేసుకోలేదు. ఈమె వ్రాసిన కథలు వసుధ, పుస్తకం, కోకిల, వనిత, ఆంధ్రజ్యోతి, అంతరంగాలు తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె తన 70వ యేట కృష్ణాజిల్లా గుడివాడలో 2016, మార్చి 10వ తేదీ గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు[1].

రచనలు[మార్చు]

 1. జ్వలిత నా కవిత
 2. మన్నించు ప్రియా (కథల సంపుటి)
 3. చక్రతీర్థం
 4. చక్రవ్యూహం
 5. నిక్షిప్త
 6. అన్వేషణ
 7. మచ్చలేని జాబిలి
 8. నయనాంజలి
 9. నేస్తమా నన్నందుకో
 10. నన్ను ప్రేమించకు
 11. సుర పుష్పధార
 12. వెన్నెల్లో అగ్ని
 13. విజేత
 14. యోగి

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]