కోటగిరి శ్రీధర్

వికీపీడియా నుండి
(కోటగిరి శ్రీధర్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కోటగిరి శ్రీధర్‌

లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు మాగంటి వెంకటేశ్వరరావు
నియోజకవర్గం ఏలూరు, ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1973-10-22) 1973 అక్టోబరు 22 (వయసు 51)
నూజివీడు, కృష్ణాజిల్లా
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కోటగిరి విద్యాధరరావు, విజయకుమారి
జీవిత భాగస్వామి సరిత కటికనేని (06 ఆగష్టు 1998)
సంతానం కావేరి, దేవన్

కోటగిరి శ్రీధర్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కోటగిరి శ్రీధర్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, నూజివీడులో 1973 అక్టోబరు 22న కోటగిరి విద్యాధరరావు, విజయ కుమారి దంపతులకు జన్మించాడు. ఆయన 1994లో గీతం కాలేజీ నుండి బిబిఎం పూర్తి చేశాడు. కోటగిరి శ్రీధర్‌ తండ్రి కోటగిరి విద్యాధరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు. శ్రీధర్ కు భార్య కె.సరిత, ఇద్దరు పిల్లలు కావేరి, దేవన్ ఉన్నారు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కోటగిరి శ్రీధర్‌ తన తండ్రి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు చేపట్టి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కోటగిరి శ్రీధర్‌ తన తండ్రి మరణాంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2017లో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాడు.[2] శ్రీధర్‌ వైసీపీలో చేరిన నాటి నుంచి ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 7 శాసన సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, స్వయంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందాడు.

ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) పై 165,925 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (23 March 2019). "తండ్రి ఆశయాల సాధనే లక్ష్యం". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  2. Sakshi (29 January 2017). "వైఎస్ఆర్ సీపీలో చేరిన కోటగిరి శ్రీధర్". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  3. Sakshi (2019). "Eluru Constituency Winner List in AP Elections 2019 | Eluru Constituency Lok Sabha Election Results". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 5 October 2021.