కోట సచ్చిదానందశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోట సచ్చిదానందశాస్త్రి

కోట సచ్చిదానంద శాస్త్రి ప్రసిద్ధ హరికథా విద్వాంసుడు.[1] ఆదిభట్ల నారాయణ దాసు యొక్క ప్రశిష్యుడు. ఈయన హరికథా శైలి ప్రత్యేకం అని చెబుతారు. 1960లు చివరి భాగం, మరియు 1980 లలో చాలా ప్రసిద్ధుడు. సచ్చిదానందశాస్త్రి గుంటూరు నివాసి. ఈయన హరికథలు, సినిమా చూస్తున్నట్లు ఉంటాయి అంటే అతిశయోక్తి లేదని చెప్పుకుంటారు. హరికథలో పాటలు, అప్పటి సినిమా హిట్ పాటలనుసరించి పాడేవారట. ఆంటే, ఆయన హరికథ చెప్తుంటే, అంత వినోదాత్మకంగా ఉంటుందన్నమాట. హరికథ చెప్తూ, ఆయన నృత్యం చేసేవారు, చక్కగా పాటలు పాడేవారు, హాస్యంగా జోక్స్ చెప్పేవారు. చెప్పే విషయం మీద అప్పటి తరం ప్రజలను ఆకట్టుకోవటానికి పూర్తి ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యేవారు. ఆంధ్రపదేశ్ లోను మరియు ఇతర రాష్ట్రాలలోను 1500 పై చిలుకు ప్రదర్శనలు ఇచ్చి అనేకుల ప్రశంసలు, సన్మానాలు అందుకొన్నారు. పండితులకే కాకుండా, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేటట్లు చెప్పి వారిని మంచి మార్గంలోకి మరలేటట్టు ప్రభావితం చేయడానికి చాలా కృషి చేశారు.

మూలాలు[మార్చు]

  1. "Spellbound Kopparapu Kavula Kalapeetham 8th anniversary celebarated". baynews.in. Retrieved 18 October 2016.

బయటి లింకులు[మార్చు]