Jump to content

కుముదవల్లి

అక్షాంశ రేఖాంశాలు: 16°33′59.292″N 81°32′15.108″E / 16.56647000°N 81.53753000°E / 16.56647000; 81.53753000
వికీపీడియా నుండి
(కోడవల్లి నుండి దారిమార్పు చెందింది)
కుముదవల్లి
కుముదవల్లి గ్రామ పరిసరాలు
కుముదవల్లి గ్రామ పరిసరాలు
పటం
కుముదవల్లి is located in ఆంధ్రప్రదేశ్
కుముదవల్లి
కుముదవల్లి
అక్షాంశ రేఖాంశాలు: 16°33′59.292″N 81°32′15.108″E / 16.56647000°N 81.53753000°E / 16.56647000; 81.53753000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
మండలంపాలకోడేరు
విస్తీర్ణం4.66 కి.మీ2 (1.80 చ. మై)
జనాభా
 (2011)[1]
4,236
 • జనసాంద్రత910/కి.మీ2 (2,400/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,109
 • స్త్రీలు2,127
 • లింగ నిష్పత్తి1,009
 • నివాసాలు1,287
ప్రాంతపు కోడ్+91 ( 08816 Edit this on Wikidata )
పిన్‌కోడ్534210
2011 జనగణన కోడ్588632

కుముదవల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పాలకోడేరు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన భీమవరం నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1287 ఇళ్లతో, 4236 జనాభాతో 466 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2109, ఆడవారి సంఖ్య 2127. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 146 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 15. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588632[2]

ఈ గ్రామానికి మరో పేరు కోడవల్లి. భీమవరం పట్టణానికి చేరువలో ఉన్న ఈ ఊరిలో బాగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు నూరుకు పైబడి వర్షాలుగా ప్రసిద్ధి గాంచిన శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం.

గ్రంథాలయ ఆచారం

[మార్చు]

కుముదవల్లి, పోడూరులలో పెళ్ళిళ్లు జరిగే సమయంలో గ్రంథాలయాలకు కట్నం ఇవ్వడం అనేదిఒకప్రత్యేక ఆచారంగా ఉండేది. అప్పట్లో ప్రతి ఒక్కరు దీనిని ఆచరించడం విధిగా ఉండేది. దీని వెనుక దాదాపు గ్రంథాలయ ఉద్యమానికి ఉన్నంత చరిత్ర. అప్పట్లో ఇప్పుడున్నంత స్థాయిలో సమాచార సాధనాలు లేవు. ముద్రణారంగం అంతగా అభివృద్ధి చెందలేదు. అలాంటి పరిస్థితుల్లో పుస్తకాలను ఒకచోటకు చేర్చి. గ్రంథాలయాలను నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ సమయంలోనే పశ్చిమగోదావరి జిల్లా కుముదవల్లివాసులు ఓ వినూత్న ప్రయోగానికి దిగారు. కందుకూరి వీరేశలింగంతో సంప్రదింపులు జరిపి ఆయన అందించిన ప్రోత్సాహంతో గ్రంథాలయ నిర్వహణకు స్వయంగా పూనుకున్నారు. అంతేకాదు గ్రామంలో ఎవరింట్లో పెళ్ళి జరిగినా- అమ్మాయి వైపు వారైనా, అబ్బాయి వైపు వారైనా గ్రంథాలయానికికి ఎంతోకొంత కట్నంగా ఇవ్వాలనే ఒప్పందానికి వచ్చారు. పెళ్లప్పుడే కాదు, ప్రతి దీపావళి రోజున ప్రతి ఒక్కరు పదిరూపాయల ఇవ్వాలనే నియమం కూడా పెట్టుకున్నారు గ్రామస్థులు. దీంతో గౌతమీ గ్రంథాలయం, రాజమండ్రి స్థాపనకు ఒక సంవత్సరం ముందే అన్ని హంగులతో.. కుముదవల్లిలో 1897 జూన్ 27న గ్రంథాలయం ఊపిరిపోసుకుంది. తర్వాత. గ్రంథాలయ నిర్వహణ కోసమే రెండు ఎకరాల భూమి సమకూరింది. ఏటా ఈ భూమిపై వచ్చే ఆదాయాన్ని లైబ్రరీ ఖాతాలో జమ చేస్తారు.

ప్రముఖులు

[మార్చు]

గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4123. ఇందులో పురుషుల సంఖ్య 2072, మహిళల సంఖ్య 2051, గ్రామంలో నివాసగృహాలు 1186 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1287 ఇళ్లతో, 4236 జనాభాతో 466 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2109, ఆడవారి సంఖ్య 2127. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 146 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 15. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588632.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల భీమవరం లోను, అనియత విద్యా కేంద్రం పాలకోడేరు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, ఏలూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కుముదవల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టరు ఒకరు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

కుముదవల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కుముదవల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 80 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 385 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 383 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కుముదవల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 383 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కుముదవల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, కూరగాయలు

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

పూతరేకులు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]