కోదండరామ స్వామి దేవాలయం (ధనుష్కోడి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధనుష్కోడిలోని కోదండరామ స్వామి దేవాలయం ముందు దృశ్యం

తమిళనాడులోని రామేశ్వరం దగ్గరలోని ధనుష్కోడిలో ఉన్న కోదండరామస్వామి దేవాలయం హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీ రాముడికి అంకితం చేయబడిన పుణ్యక్షేత్రం. ఇది రామేశ్వరం నుండి 13 కిలోమీటర్ల (8.1 మై) దూరంలో ఉంది, ఇది ద్వీపం దక్షిణ కొనను ఏర్పరుస్తుంది. ఈ ఆలయంలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, విభీషణుడు దేవతలు ఉన్నారు. ఈ దేవాలయం సముద్రంతో చుట్టబడి పర్యాటక ఆకర్షణగా అలరారుతోంది. 1964లో వచ్చిన తుఫాను కారణంగా ధనుష్కోడి తీవ్రంగా ప్రభావితమైనప్పుడు, ఈ ఆలయం మాత్రమే మనుగడలో ఉంది.[1]

చారిత్రక నేపథ్యం[మార్చు]

ఈ ఆలయం దాదాపు 500-1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అంచనా. రాముడి ప్రధాన విగ్రహం, విల్లు (కోతండం) కలిగి ఉన్నట్లు చిత్రీకరించబడింది, అందుకే ఈ విగ్రహానికి కోదండరామస్వామి అని పేరు వచ్చింది.[2]

ప్రాముఖ్యత[మార్చు]

రావణుడి తమ్ముడు విభీషణుడు రాముడిని, అతని వానర (వానర పురుషులు) సైన్యాన్ని ఆశ్రయం కోరిన ప్రదేశంగా ఈ ఆలయ ప్రదేశాన్ని నమ్ముతారు. ఈ సంప్రదాయం ప్రకారం, సీతను అపహరించిన తరువాత, విభీషణుడు రావణునికి ఆమెను రాముని వద్దకు తిరిగి ఇవ్వమని సలహా ఇచ్చాడు. అయితే, రావణుడు అతడి సలహా వినలేదు, ఇది విభీషణుడు లంక నుండి పారిపోయి రాముడి సైన్యంలో చేరడానికి దారితీసింది. విభీషణుడు రాముడి శరణు కోరినపుడు, వానర సైన్యం విభీషణుడిని గూఢచారి అని నమ్మి అంగీకరించవద్దని రాముడిని కోరింది. అయితే, శరణని వచ్చిన వారిని రక్షించడం తన కర్తవ్యమని పేర్కొంటూ రాముడు విభీషణుడిని అంగీకరించాడు. రావణ సంహారం తరువాత, రాముడు ఈ ప్రదేశంలో విభీషణునికి "పట్టాభిషేకం" (లంక రాజుగా అధిరోహించడం) చేసారని కూడా చెబుతారు. గుడి లోపల గోడలకు ఈ కథ చిత్రీకరించబడింది.[2][3][4]

స్థానం[మార్చు]

బంగాళాఖాతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ చుట్టూ ఉన్న ఒక ద్వీపంలో ఉన్న ఈ ఆలయం రామేశ్వరం నుండి 13 కిలోమీటర్లు (8.1 మై) దూరంలో ఉంది. 1964 రామేశ్వరం తుఫాను కారణంగా ధనుష్కోడి తీవ్రంగా ప్రభావితమైనప్పుడు, ఈ ఆలయం మాత్రమే మనుగడలో ఉంది. స్వామి వివేకానంద తన చికాగో పర్యటన తర్వాత ఈ ప్రదేశాన్ని సందర్శించినట్లు చెబుతారు.[5]

మూలాలు[మార్చు]

  1. Dr. Shiv Sharma (2008). India - A Travel Guide. Diamond Pocket Books (P) Ltd. p. 730. ISBN 978-81-284-0067-4. Retrieved 5 June 2013.
  2. 2.0 2.1 "Kodandaramar Temple : Kodandaramar Temple Details | Kodandaramar- Rameswaram | Tamilnadu Temple | கோதண்டராமர்". en:Dina Malar. Retrieved 5 June 2013.
  3. Various (2003). Tourist Guide to South India. Sura Books. pp. 114–115. ISBN 978-81-7478-175-8. Retrieved 5 June 2013.
  4. Sunita Pant Bansal (1 January 2008). Hindu Pilgrimage. Pustak Mahal. ISBN 978-81-223-0997-3. Retrieved 6 June 2013.
  5. "Pachauri to head six-member experts committee". en:The Hindu. 31 July 2008. Archived from the original on 5 August 2008. Retrieved 5 June 2013.