కోదాటి రాజమల్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోదాటి రాజమల్లు

మాజీ లోక్‌సభ సభ్యుడు , మాజీ ఎమ్మెల్యే
పదవీ కాలం
1980 నుండి ఫిబ్రవరి 20 , 1983
నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం & చెన్నూర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 24 జూన్ 1924
అలిపురం, పెద్దపల్లి , కరీంనగర్‌ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం 1983 ఫిబ్రవరి 20
హైదరాబాద్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు సోషలిస్టు పార్టీ
తల్లిదండ్రులు కోదాటి రాజయ్య, రాజవ్వ
జీవిత భాగస్వామి దేవకీ దేవి [1]
సంతానం ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు
నివాసం హైదరాబాద్

కోదాటి రాజమల్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి పెద్దపల్లి ఎంపీగా , నాలుగుసార్లు చెన్నూర్ ఎమ్మెల్యేగా పని చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కోదాటి రాజమల్లు 24 జూన్ 1924లో తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి, అలిపురం గ్రామంలో కోదాటి రాజయ్య, రాజవ్వ దంపతులకు జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

కోదాటి రాజమల్లు 1952లో సోషలిస్టు పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1952లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1960లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1962, 1967, 1972 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పని చేశాడు. కోదాటి రాజమల్లు 1980లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Andrajyothy (14 November 2017). "కోదాటి దేవకీదేవి మృతిపై ఉత్తమ్‌, భట్టి సంతాపం". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 11 August 2021.
  2. Sakshi (4 November 2023). "చట్టసభల్లో నల్ల సూరీళ్లు". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  3. Loksabha (2019). "Members Bioprofile". Retrieved 11 August 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. Sakshi (24 March 2019). "అనితరసాధ్యుడు.. కోదాటి రాజమల్లు". Archived from the original on 11 August 2021. Retrieved 11 August 2021.