కోమిటాస్ మ్యూజియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోమిటాస్ మ్యూజియం-ఇన్స్టిట్యూట్
Կոմիտասի թանգարան-ինստիտուտ
కోమిటాస్ పాంథియన్ ధగ్గరలోని మ్యూజియం
స్థాపితం2015
ప్రదేశంఅర్షకున్యాత్స్ అవెన్యూ, యెరెవాన్,  Armenia
రకంబయోగ్రాఫికల్ , కళా మ్యూజి యం
డైరక్టరునికోలయ్ కోస్తంద్యాన్
వెబ్‌సైటుofficial website

అధికారికంగా, కోమిటాస్ మ్యూజియం-ఇన్స్టిట్యూట్ (అర్మేనియన్: Կոմիտասի թանգարան-ինստիտուտ) ఒక కళ, జీవిత మ్యూజియం. ఇది ఆర్మేనియా రాజధాని యెరెవాన్లో ఉంది. దీనిని ప్రఖ్యాత ఆర్మేనియన్ సంగీత, స్వరకర్త కోమిటాస్ కు అంకితం చేశారు. ఇది షెంగావిత్ జిల్లాలోని కోమిటాస్ పార్కులో ఉన్న పాంథియాన్ పక్కన ఉంది. ఈ మ్యూజియాన్ని జనవరి 2015 న ప్రారంభించారు.

మ్యూజియం[మార్చు]

24 జూలై 2014 న కోమిటాస్ మ్యూజియం-ఇన్స్టిట్యూట్ ను ఒక వాణిజ్య సంస్థగా స్థాపించాలని ఆర్మేనియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని కోమిటాస్ పార్కులో పాత సంస్కృతి ఇళ్ళు స్థానంలో నిర్మించారు. ఈ నిర్మాణానికి కావలసిన నిధులను "ప్యునిక్", "లుయ్స్" ఫౌండేషన్ల వారు సమకూర్చారు. ఈ ప్రాజెక్టు యొక్క ఆర్కిటెక్టు ఆర్థుర్ మెస్చియన్. ఈ మ్యూజియం-ఇన్స్టిట్యూట్ ను ప్రెసిడెంటు సెర్ఝ్ సర్గస్యాన్, ఆర్మేనియాలోని కాథలిక్స్ కరెకిన్ 2, సిసిలియా లోని కాథలిక్స్ అరాం 1 ఆధ్వర్యంలో అధికారికంగా ప్రారంభించారు.

ఈ మ్యూజియంలో ఒక పెద్ద కచేరీ హాల్, శాశ్వత, తాత్కాలిక ప్రదర్శన మందిరాలు, విభాగాలు, రీసెర్చ్ సెంటరు, మ్యూజిక్ స్టూడియో, లైబ్రరీ, పబ్లిషింగ్ హౌస్ ఉన్నాయి. కోమిటాస్ వర్దాపేట్ యొక్క వ్యక్తిగత వస్తువులను ఈ మ్యూజియంలో చేర్చారు. కోమిటాస్ యొక్క జీవితం, అతని వృత్తి, తన సంగీతం, మత కెరీర్లుతో పాటు తన యొక్క గొప్ప వారసత్వం పరిశోధనలయిన ఆర్మేనియన్ ఫోల్క్ లోరిక్ సంగీతానికి సంబంధించిన వస్తువులను, మ్యూజియంలోని ఎనిమిది విభాగాలలో శాశ్వతంగా ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టును కంపోస్ చెసినది వర్ధాన్ కారపెత్యాన్, ఛిత్రకారుడు అల్బెర్టో టార్సెల్లో. ఈ మ్యూజియం నిర్మాణాన్ని అమలు చేసింది ఆర్మేనియా జాతీయ మ్యూజియాల శాఖ.

ఎగ్జిబిషన్ మందిరాలు[మార్చు]

కోమిటాస్ సంతకం
  • మొదటి హాలులో, "క్రోనాలజీ": కోమిటాస్ జీవిత చరిత్రకు అంకితం చేశారు.
  • రెండవ హాలులో, "కోమిటాస్ , అతని సమకాలీన": కోమిటాస్ నడచిన విధానాన్ని, శాస్త్రీయ ఆలోచనలు, అతని భాగస్వాముల యొక్క మత విలువలను ఉంచారు.
  • మూడవ హాలులో, "కోమిటాస్ ఆలోచనలు".
  • నాల్గవ హాలులో, "ఫొల్క్ లోరిక్ రీసెర్చులో కోమిటాస్ రచించినవి".
  • ఐదవ హాలులో, "ఒక కంపోజరుగా కోమిటాస్".
  • ఆరవ హాలులో, "కోమిటాస్ , కర్మ సంగీతం".
  • ఏడవ హాలులో, "కోమిటాస్ యొక్క ప్రదర్శనలు".
  • ఎనిమిదవ హాలులో, "కోమిటాస్ వారసత్వం".

గ్యాలరీ[మార్చు]

సూచనలు[మార్చు]