కోరాడ మహాదేవ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోరాడ మహాదేవ శాస్త్రి
Korada mahadeva sastri.jpg
పుట్టిన తేదీ, స్థలంకోరాడ మహాదేవ శాస్త్రి
1912
వృత్తిరచయిత, భాషా శాస్త్రవేత్త
పౌరసత్వంభారతీయుడు
పూర్వవిద్యార్థికలకత్తా విశ్వవిద్యాలయం
విషయంభాషా శాస్త్రంలో పరిశోధకుడు
జీవిత భాగస్వామిసరస్వతి
సంతానం3 కుమారులు, ఒక కుమార్తె

కోరాడ మహాదేవ శాస్త్రి గారు భాషా శాస్త్రంలో పరిశోధకుడు. 2011 కి గాను బ్రౌన్ పురస్కార గ్రహీత.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అతను బందరులో 1921లో జన్మించాడు. 1944లో చెన్నపట్టణంలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చరిత్ర, ఆర్ధిక శాస్త్రాల్లో ఉన్నత విద్యనభ్యసించాడు. కొంతకాలం సంబంధిత రంగాల్లో పరిశోధన చేసాడు. 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం లోని భాషా శాస్త్రవేత్త సునీతి కుమార్ చటర్జీ మార్గదర్శకత్వంలో, సుకుమార్ సేన్, క్షితిజ్ చంద్ర చటర్జీల శిష్యరికంలో ప్రథమునిగా ఉత్తీర్ణుడై బంగారు పతకం, డి.లిట్ పట్టాను పొందాడు. అతను ఆర్థశాస్త్రం, కంపారిటివ్ ఫిలోలజీ, తెలుగు (లిట్) లలో మూడు పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలను చేసాడు. 1961లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ సునీతి కుమార్ ఛటర్జీ మార్గదర్శకత్వంలో తెలుగు చారిత్రక వ్యాకరణంపై పరిశోధన చేసాడు. అన్నామలై విశ్వవిద్యాలయ భాషాశాస్త్ర విభాగంలో అధ్యాపకునిగా తన వృత్తిని ప్రారంభించాడు, తరువాత తెలుగు విభాగంలో, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో. అనంతపూర్ శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1976-78 కాలంలో అతను జర్మనీలోని కోల్న్ విశ్వవిద్యాలయంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండాలజీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసాడు.

అతను మానవ శాస్త్ర విభాగంలో క్షేత్ర పరిశోధనలు చేసి ఉత్తర ప్రదేశ్‌లో యునెస్కో ప్రాజెక్టులో భాగంగా భోజ్‌పురీ మాండలికాన్ని అధ్యయనం చేశాడు. అతను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకునిగా పనిచేసి పదవీవిరమణ చేసాడు. సునీతి కుమార్ ఛటర్జీ, మీనాక్షిసుందరం పిళ్ళై, క్షితీష్ చంద్ర ఛటర్జీ వంటి అనుభవజ్ఞుల అధ్వర్యంలో శిక్షణ పొంది తెలుగు భాష, భాషాశాస్త్రానికి అమూల్యమైన కృషి చేశాడు. 1971 లో ఉనికిలోకి వచ్చిన ద్రావిడ భాషాశాస్త్ర సంఘాన్ని స్థాపించడానికి ఉద్యమాన్ని ప్రారంభించిన ముగ్గురు వ్యక్తులలో అతను ఒకడు. మిగిలిన ఇద్దరు ప్రొఫెసర్ వి.ఐ. సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ ఆర్.సి. హిరేమత్ లు. వీరు ద్రావిడ భాషా సంఘం స్థాపనకు మార్గం సుగమం చేసిన ముగ్గురు ద్రవిడ భాషా శాస్త్రవేత్తలు.[2]

పదేళ్లకు పైగా అన్నామలై, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో బోధించాడు. జర్మనీలో మూడేళ్ళ పాటు ఆచర్యునిగా పనిచేసాడు. అతను త్రివేండ్రంలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ద్రావిడియన్ లింగ్విస్టిక్స్ కు గౌరవాధ్యక్షత వహించాడు.

అతను పరిశోధక విద్యార్థిగా గావించిన కృషి తెలుగు చారిత్రక వ్యాకరణంగా రూపు దిద్దుకుంది. ఈ విశిష్ట గ్రంధాన్ని హరప్పా లిపిని అర్థవంతంగా చదివే ప్రయత్నాల్లో ఐరావతం మహదేవన్ వినియోగించుకున్నాడు.[3]

అతని ప్రధాన రచనలలో హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు, డిస్క్రిప్టివ్ గ్రామర్ అండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ మోడరన్ తెలుగు, ఆంధ్ర వాంజ్ఞయ పరిచయం, బాల ప్రౌఢ వ్యాకరణ దీపిక, తెలుగు వాచస్పతి నిఘంటు - స్థానిక తెలుగు భాషా శబ్దవ్యుత్పత్తి నిఘంటువు ముఖ్యమైనవి. అంతేకాకుండా అతను జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో అనేక విలువైన పరిశోధనా పత్రాలను ప్రచురించాడు.

మరణం[మార్చు]

అతను 2016 అక్టోబరు 11న తన 96వ యేట అనంతపురంలో మరణించాడు.

రచనలు[మార్చు]

 • Historical Grammar of Telugu(1969) ,
 • Descriptive Grammar of Telugu,(1985)
 • Hand Book of Modern Telugu (1985),
 • వ్యాకరణ దీపిక(1984) ,
 • ఆంధ్ర వాజ్మయ పరిచయము ,
 • తెలుగు వ్యుత్పత్తి పద కోశము(2003).
 • A Folktale in Western Bhojpuri (1954),
 • Prakrit inscriptions in Buddhic Andhra,
 • Dialectal differences in Eleventh Century Telugu,
 • పాళీ భాషా వాఙ్మయములు ,
 • ప్రాఙ్నన్నయ శాసన భాషలో గ్రాంధిక వ్యావహారిక భేదములు.
 • తెలుగు దేశ్యవ్యుత్పత్తి నిఘంటువు[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

శాస్త్రికి అతని భార్య సరస్వతి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు డాక్టర్ కె. రామకృష్ణ అనంతపురంలోని ఎస్ఎ ఎస్ బి ఎన్ కళాశాలలో రిటైర్డ్ ప్రిన్సిపాల్. అతని రెండవ కుమారుడు డాక్టర్ వెంకట్ కోరాడ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగంలో పనిచేశాడు. అతని మూడవ కుమారుడు డాక్టర్ కె. సూర్యనారాయణ తిరుపతిలోని రాష్ట్ర సంస్కృత విద్యాపీఠంలో సంస్కృత ప్రొఫెసర్. అతని కుమార్తె విజయ లక్ష్మి అల్లుడు డాక్టర్ జనార్దనం లు డెంటల్ సర్జన్ లుగా చెన్నైలో నివసిస్తున్నారు.

మూలాలు[మార్చు]

 1. "శ్రీ ఖరనామ సంవత్సర బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు గ్రహీతలు – ఈమాట" (in ఆంగ్లం). Retrieved 2020-06-19.
 2. A MONTHLY OF DRAVIDIAN LINGUISTICS ASSOCIATION OF INDIA, Vol 40 No. 11, Website: www.ijdl.org ; NOVEMBER 2016 
 3. "2011 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు". పుస్తకం (in ఆంగ్లం). 2011-11-03. Retrieved 2020-06-19.
 4. "Telugu Desya Vyutpatti Nighantuvu". www.telugubooks.in (in ఆంగ్లం). Retrieved 2020-06-19.

బయటి లంకెలు[మార్చు]