క్రితి గరుడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కృతి గరుడ భారతదేశానికి చెందిన మొదటి పౌర మహిళా హెలికాప్టర్ పైలట్.[1] ఆమె హవాయిలో సివిలియన్ హెలికాప్టర్ పైలట్‌గా ఉంది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన మహిళ. ఆమె హెలికాప్టర్‌ను నడిపే నైపుణ్యం, లైసెన్స్ పొందిన పైలట్. ఆమె చిన్నతనం నుంచి హెలికాప్టర్ పైలట్ కావాలని కలలు కనేది. ఆమె గోవాలోని బిట్స్ పిలానీ నుండి ఇంజనీరింగ్ పట్టా పొంందింది. భారతదేశంలో పైలట్ గా శిక్షణా పాఠశాల లేకపోవడం వల్ల ఆమె పైలట్‌గా మారడం కష్టంతరం అయింది. దీని కోసం ఆమె ముఖ్యంగా కెనడా, యునైటెడ్ స్టేట్స్, దక్షిణాఫ్రికాలో దీనిని కొనసాగించవచ్చని తెలుసుకుంది. కృతి హెలికాప్టర్ పైలట్ శిక్షణలో చేరి ఒక సంవత్సరం లోపే పూర్తి చేసింది. ఆమె అద్భుతమైన ప్రదర్శన తర్వాత, ఆమె ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం పొందింది, ఒక సంవత్సరం పనిచేసింది. కృతి తర్వాత అసిస్టెంట్ చీఫ్ పైలట్‌గా పదోన్నతి పొందింది, గత రెండేళ్లుగా ఆమె చీఫ్ పైలట్‌గా పనిచేసింది. పైలట్‌గా నియమితులు కావడానికి రెండు లైసెన్సులు మాత్రమే అవసరం కాగా, ఆమె ఐదు లైసెన్సులు పొందారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో శిక్షణ పొందిన, ఛాపర్ పైలట్‌గా పనిచేస్తున్న ఏకైక భారతీయ పౌర మహిళ కూడా ఆమె.

మూలాలు

[మార్చు]
  1. "అగ్నిపర్వతం మీదుగా హెలికాప్టర్‌ నడిపా". EENADU. Retrieved 2022-08-18.
  2. "'ఇంత చిన్నమ్మాయి హెలీకాప్టర్ నడిపిస్తుందా అని అంతా ఆశ్చర్యపోయారు'". BBC News తెలుగు. 2022-07-04. Retrieved 2022-08-18.