క్రియా జన్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రసాయన చర్యలో యేర్పడే పదార్థాలను క్రియాజన్యాలు అంటారు. ఉదాహరణకు జింకు ముక్కలను ఉదజహరికామ్లము (హైడ్రోక్లోరికామ్లం) లో వేసినపుడు జింకు క్లోరైడ్, హైడ్రోజన్ (ఉదజని) వాయువు వెలువదుతుంది. ఈ చర్యలో చర్య జరుగక ముందు గల పదార్థాలు జింకు ముక్కలు, హైడ్రోక్లోరికామ్లము కనుక ఈ పదార్థాలను క్రియా జనకాలు అంటారు. చర్యలో యేర్పడిన పదార్థాలైన జింకు క్లోరైడ్, హైడ్రోజన్ లను క్రియా జన్యాలు అంటారు.క్రియా జనకాలు క్రియా జన్యాలుగా మారవలెనంటే కొన్ని రసాయన చర్యలలో ఉత్ప్రేరకాలు అవసరమగును. కొన్ని చర్యలు ఉష్ణాన్ని గ్రహించి క్రియా జన్యాలనిస్తాయి. క్రియా జనకాలు క్రియా జన్యాలుగా యేర్పడుట అనునది క్రియా జన్యాల గాఢత పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పైన పేర్కొన్న రసాయన చర్యలో సజల ఆమ్లం తీసుకొంటే చర్య వేగం తగ్గుతుంది. అదే గాఢ ఆమ్లం తీసుకొంటే చర్యా వేగం పెరుగుతుంది.

ద్రవ్య నిశ్చత్వ నియమము[మార్చు]

ద్రవ్య నిశ్చత్వ నియమం ప్రకారం ఒక రసాయన చర్యలో క్రియాజనకాల ద్రవ్యరాశి క్రియాజన్యాల ద్రవ్యరాశికి సమానమవుతుంది.

నిత్యజీవితంలో[మార్చు]

  • మన వంటగది ఒక రసాయన ప్రయోగశాల. మనం అనేక రసాయన పదార్థాలతో వంటలను చేస్తాం. వంటకు కావససిన సామాగ్రి క్రియాజనకాలైతే యేర్పడిన పదార్థాలు క్రియాజన్యాలు అవుతాయి.
  • కొన్ని పరిస్థితులలో క్రియా జనకాల చర్యా వేగం తగ్గినపుడు ఉత్ప్రేరకాలు వాడవలసి ఉంటుంది. కఠిన జలంతో పప్పులు ఉడకనపుడు మనం వంట సోడాను ఉత్ప్రేరకంగా వాడుతాము.