క్రెయిగ్ స్పియర్‌మ్యాన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | క్రెయిగ్ ముర్రే స్పియర్‌మాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 4 July 1972 ఆక్లాండ్, న్యూజీలాండ్ | (age 52)|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | స్పియర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 0 అం. (1.83 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 195) | 1995 డిసెంబరు 8 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2000 నవంబరు 30 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 96) | 1995 డిసెంబరు 15 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2001 ఫిబ్రవరి 11 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1993/94–1995/96 | Auckland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1996/97–2004/05 | Central Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2002–2009 | గ్లౌసెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 మే 4 |
క్రెయిగ్ ముర్రే స్పియర్‌మాన్ (జననం 1972, జూలై 4) ఇంగ్లీష్-న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1995 నుండి 2001 వరకు న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున 19 టెస్టులు, 51 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1] 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలుచుకున్న న్యూజీలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఆక్లాండ్‌లోని కెల్‌స్టన్ బాయ్స్ హైస్కూల్, న్యూజీలాండ్‌లోని మాస్సే యూనివర్సిటీలో తన చదువును పూర్తిచేశాడు.
దేశీయ క్రికెట్
[మార్చు]తోటి న్యూజీలాండ్ ఆటగాడు జాన్ బ్రేస్‌వెల్‌తో సమావేశమైన తర్వాత, కోచింగ్‌గా ఉన్న గ్లౌసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు ఆడమని అడిగాడు. స్పియర్‌మ్యాన్ తన మొదటి మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన వెంటనే బ్రిస్టల్‌లో ఫేవరెట్ అయ్యాడు.
2004లో గ్లౌసెస్టర్‌లో మిడిల్‌సెక్స్‌పై 341 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌లో 40 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.[2] ఆ తరువాత మరో రెండు డబుల్ సెంచరీలను చేశాడు.
2005లో ఆక్స్‌ఫర్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓవర్‌లో 34 పరుగులు చేశాడు.[3] 2006లో నార్తాంప్టన్‌షైర్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించిన కౌంటీ 4వ ఆటగాడిగా నిలిచాడు. ఛాంపియన్‌షిప్‌లో ఒక సంవత్సరకాలంలో 1370 పరుగులు చేశాడు. 2009లో 22.88 సగటుతో 206 పరుగులతో కేవలం ఆరు ఛాంపియన్‌షిప్ ప్రదర్శనలను మాత్రమే చేసాడు. సంవత్సరం చివరిలో ఒప్పందం విరమించుకోవడానికి అంగీకరించాడు.[4]
సెంట్రల్ కాన్ఫరెన్స్ క్రికెట్ జట్టు తరపున దేశీయ క్రికెట్ ఆడాడు.
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]కుడిచేతి వాటం కలిగిన ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు. స్పియర్‌మ్యాన్ 1995 డిసెంబరులో న్యూజీలాండ్ తరపున క్రైస్ట్‌చర్చ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. జింబాబ్వేపై 112 పరుగుల ఇన్నింగ్స్‌లో ఒక టెస్ట్ సెంచరీని మాత్రమే చేశాడు. 1996 క్రికెట్ ప్రపంచ కప్ సిరీస్ లో న్యూజీలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి విరమణ పొందిన తర్వాత, బ్యాంకింగ్‌లో వృత్తిని కొనసాగించడానికి 2001లో ఇంగ్లాండ్‌కు వెళ్ళాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Wasim brings his soul to county party". The Independent. 20 April 2003.
- ↑ "Most Runs in an Innings for Gloucestershire". CricketArchive.
- ↑ "The XI worst overs". Wisden Cricketer. ESPNcricinfo. August 2005.
- ↑ "Spearman ends Gloucestershire career". County Cricket 2009. ESPNcricinfo. 2 October 2009.