Jump to content

క్రోమియం(III)ఆక్సైడ్

వికీపీడియా నుండి
క్రోమియం(III)ఆక్సైడ్
పేర్లు
ఇతర పేర్లు
Chromium sesquioxide
Chromia
Chrome green
Eskolaite
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1308-38-9]
పబ్ కెమ్ 517277
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:48242
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య GB6475000
SMILES O=[Cr]O[Cr]=O
ధర్మములు
Cr2O3
మోలార్ ద్రవ్యరాశి 151.9904 g/mol
స్వరూపం light to dark green, fine crystals
సాంద్రత 5.22 g/cm3
ద్రవీభవన స్థానం 2,435 °C (4,415 °F; 2,708 K)
బాష్పీభవన స్థానం 4,000 °C (7,230 °F; 4,270 K)
insoluble
ద్రావణీయత in alcohol insoluble in alcohol, acetone, acids
అయస్కాంత ససెప్టిబిలిటి +1960.0·10−6 cm3/mol
వక్రీభవన గుణకం (nD) 2.551
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
hexagonal
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−1128 kJ·mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
81 J·mol−1·K−1
ప్రమాదాలు
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 1 mg/m3
REL (Recommended)
TWA 0.5 mg/m3
IDLH (Immediate danger)
250 mg/m3
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

క్రోమియం(III)ఆక్సైడ్ ఒక రసాయన సమ్మేళన పదార్ధం.ఇది ఒక ఆకర్బన రసాయన సంయోగ పదార్ధం.క్రోమియం, ఆక్సిజన్ మూలకాల పరమాణువుల సంయోగం వలన ఈ రసాయన పదార్ధం ఏర్పడినది.ఈ రసాయన సంయోగ పదార్ధం యొక్క రసాయన ఫార్ములా Cr2O3.అనగా యొక అణువులో రెండు క్రీమియం పరమాణువులు,మూడు ఆక్సిజన్ పరమాణువులు బంధం ఏర్పరచుకుని ఉండును.క్రీమియం(III)ఆక్సైడ్ సంయోగ పదార్ధం క్రోమియం మూలక లోహం యొక్క ముఖ్యమైన ఆక్సైడ్, దీనిని రంగుగా ఉపయోగిస్తారు.ఇది అతి అరురైన ఎస్కోలైట్ (eskolaite)అనుఖనిజంగా కూడా లభిస్తుంది.ఎస్కోలైట్ ఖనిజం క్రోమియాన్ని అధికంగా కల్గిన ట్రేమోలైట్(tremolite)skarnsలో,మెటా క్వార్జైట్స్‌లో లభిస్తుంది.క్రోమియం ట్రై ఆక్సైడ్ ఖనిజానికి ఫిన్నిస్ భూగర్భ శాస్త్రవేత్త పెన్ట్టిఎస్కోల జ్ఞాపకార్థంగా ఎస్కోలైట్ అని పెట్టారు.

భౌతిక , ఇతర గుణాలు

[మార్చు]

క్రోమియం (III)ఆక్సైడ్ అణునిర్మాణం అల్యూమినియం ఆక్సైడ్ /కోరండం(corundum )అణు సౌష్టావాన్ని పొంది ఉంది.కోరండం వలే ఇది కూడా కరినమైనది, పెలుసైనది.దీని మోహ్స్(Mohs) కఠినత్వ విలువ/గట్టి ధనపు విలువ 8-8.5.307K వరకు ఈ సంయోగ పదార్ధం యాంటి ఫెర్రో మాగ్నటిక్ గుణాన్ని కల్గి ఉంది.ఇది సాధారణంగా ఆమ్ల, క్షారపదార్థాల ఆక్సీకరణ,క్షయికరణ దాడులను నిలువరించగలదు.కాని ద్రవీయుత క్షారాలతో క్రోమేట్ లను(CrO2−4 అయానులున్న లవణాలు)ఏర్పరచును.క్రోమియం ఆక్సైడ్‌ను వేడి చేసిన బ్రౌన్ రంగుకు మారును.మామూలు ఉష్ణోగ్రత వరకు చల్ల బరచిన మళ్ళి ముదురు ఆకుపచ్చ రంగును పొందును.ఇది ఆర్ద్రతాకర్షణ కలిగిన సంయోగ పదార్ధం.

భౌతిక లక్షణాలు

[మార్చు]

అణుభారం:151.989 గ్రాములు /మోల్[1].సాంద్రత:5.22 గ్రాములు/సెం.మీ3[2].ద్రవీభవన స్థానం:2435 °C[3].బాష్పీభవన స్థానం/మరుగు ఉష్ణోగ్రత:4,000 °C[2] ద్రావణీయత:నీటిలో కరుగదు.అలాగే ఆల్కహాలు,ఎసిటోన్, ఆమ్లాలలో కరుగదు.వక్రీభవన సూచిక(nD): 2.551

ఉత్పత్తి

[మార్చు]

పెన్నేటిర్, బినేట్ అనే పార్శి వాళ్ళు 1838 కాలంలో ఒక రహస్య ఫార్ములా ద్వారా పారదర్శకమైన సజల క్రోమియం ట్రైఆక్సైడ్ తయారు చేసి రంగు పదార్థంగా విక్రయించడం మొదలెట్టారు.క్రోమియం ట్రై ఆక్సైడ్ ను వాళ్ళు క్రోమైట్(Fe,Mg)Cr2O4) నుండి ఉత్పత్తి చేసారు.క్రోమైట్‌ను సోడియం డైక్రోమేట్ (Na2Cr2O7) గా అనువర్తించి,దానిని సల్ఫర్తో అధిక ఉష్ణోగ్రతలో క్షయికరిచడం వలన క్రోమియం (III)ఆక్సైడ్ ను ఉత్పత్తి చేసారు.

Na2Cr2O7 + S → Na2SO4 + Cr2O3

క్రోమియం(III) ఆక్సైడ్ ను క్రోమియం నైట్రేట్ వంటి క్రోమియం లవణాలను వియోగం చెందించడం ద్వారా కూడా ఉత్పత్తి చేయ వచ్చును. అలాగే అమ్మోనియం డై క్రోమేట్ ను ఉష్ణ విమోచక వియోగం ద్వారా కూడా ఉత్పత్తి చెయ్యవచ్చును.

(NH4)2Cr2O7 → Cr2O3 + N2 + 4 H2O

ఈ రసాయన చర్య 200°Cకన్నా తక్కువ జ్వలన ఉషోగ్రతలో(ignition temperature)జరగడం వలన ఈఈ రసాయన చర్యను అగ్నిపర్వాతాల ఏర్పడు విధానంగా ప్రయోగాత్మక ప్రదర్శనగా చూపిస్తారు.

రసాయన చర్యలు

[మార్చు]

క్రోమియం(III)ఆక్సైడ్ ద్విశ్వభావయుత (amphoteric)రసాయన సంయోగ పదార్థం.ఇది నీటిలో కరుగదు.కాని ఆమ్లంలో కరగడం వలన సజల క్రోమియం ఆయాన్ లను( [Cr(H2O)6]3+ )ఏర్పరచును.ఈక్రిమియం అయానులు క్షారంతో రసాయన చర్య వలన [Cr(OH)6]3−.లవణాలను ఏర్పరచును.

క్రోమియం (III)క్లోరైడ్ ను మెత్తని పొడిగాచేసిన అల్యూమినియం లోహ తోచూర్ణం కలిపి వేడి చేసిన క్షయికరణ వలన క్రోమియం లోహం, అల్యూమినియం అక్సైడ్‌ను ఏర్పరచును.

Cr2O3 + 2 Al → 2 Cr + Al2O3

క్రోమియం (III)ఆక్సైడ్ యొక్క థెర్మిట్ రసాయన చర్యలో ఇది ఎటువంటి పొగ, నిప్పు రవ్వలను వెలువరించకుండ ప్రకాశవంతంగా వెలుగును.అయితే క్రోమియం యొక్క అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత కారణంగా క్రోమియం థెర్మిట్ కాస్టింగ్ చెయ్యడం ఆచరణ అసాధ్యం.

క్రోమియం (III)ఆక్సైడ్ ను క్లోరిన్, కార్బన్తో కలిపి వేడి చెయ్యడం వలన క్రోమియం (III)క్లోరైడ్, కార్బన్ డయాక్సైడ్ ఏర్పడును.

Cr2O3 + 3 Cl2 + 3 C → 2 CrCl3 + 3 CO

క్రోమియం (III)ఆక్సైడ్, వేరే ఆక్సైడ్ ను బేసిక్ మౌలిక వాతావరణపరిసరాలలో(basic environment) లో ఆక్సీకరణ కావించడం వలన క్రోమైట్లను ఉత్పత్తి చెయ్యవచ్చును

2Cr2O3 + 4 MO + 3 O2 → 4 MCrO4

అనువర్తనాలు/ఉపయోగాలు

[మార్చు]

క్రోమియం ఆక్సైడ్ యొక్క స్థిరమైనగుణం వలన దీనిని రంగు పదార్థంగా సాధారణంగా ఉపయోగించు సంయోగ పదార్థాన్ని విరిడియన్అంటారు.దీనిని రంగులలో,సిరాలలో,, గాజు వస్తువులలో రంగుపదార్థంగా ఉపయోగిస్తారు.అయస్కాత వర్ణమైన క్రోమియం డైఆక్సైడ్ ను తయారు చేయుటకు పూర్వగామి(precursor)గా ఉపయోగిస్తారు.ఆ రసాయన చర్యను దిగువన పేర్కొనబడింది.

Cr2O3 + 3 CrO3 → 5 CrO2 + O2

తోలు,వస్త్రం లేదా బాల్సా వంటి వాటి మీద పూతగా పూసి,కత్తులు,రేజర్లు వంటివస్తువుల అంచులను పదును పెట్టుటకై /నునుపు చెయ్యుటకు(polishing) ఉపయోగిస్తారు.ఇలా పదును పెట్టుఈ పదార్థాన్ని ప్రత్నామ్యాయంగా పచ్చ రసాయన పదార్థము అని పిలుస్తారు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "Chromium(III) Oxide". pubchem.ncbi.nlm.nih.gov. Archived from the original on 2017-03-16. Retrieved 2017-03-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "Chromium(III) Oxide". americanelements.com. Archived from the original on 2017-03-16. Retrieved 2017-03-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Substance:Chromium(III) oxide". rsc.org. Archived from the original on 2017-03-16. Retrieved 2017-03-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

[[వర్గం:క్రోమియం సమ్మేళనాలు]]