క్రోమియం(III)సల్ఫేట్
![]() | |
పేర్లు | |
---|---|
IUPAC నామము
క్రోమియం(III)సల్ఫేట్
| |
ఇతర పేర్లు
Basic chromium sulfate, chromic sulfate
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10101-53-8] |
పబ్ కెమ్ | 24930 |
SMILES | [Cr+3].[Cr+3].[O-]S(=O)(=O)[O-].[O-]S([O-])(=O)=O.[O-]S([O-])(=O)=O.O.O.O.O.O.O.O.O.O.O.O.O |
| |
ధర్మములు | |
Cr2(SO4)3 • 12H2O | |
మోలార్ ద్రవ్యరాశి | 392.16 g/mol 608.363 g/mol (dodecahydrate) 716.45 g/mol (octadecahydrate) |
స్వరూపం | reddish-brown crystals (anhydrous), purple crystals (hydrated) |
సాంద్రత | 3.10 g/cm3 (anhydrous) 1.86 g/cm3 (pentadecahydrate) 1.709 g/cm3 (octadecahydrate) |
ద్రవీభవన స్థానం | 90 °C |
బాష్పీభవన స్థానం | decomposes to chromic acid |
insoluble (anhydrous) soluble (hydrated) | |
ద్రావణీయత | soluble in alcohol practically insoluble in acid |
అయస్కాంత ససెప్టిబిలిటి | +11,800·10−6 cm3/mol |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | MSDS |
జ్వలన స్థానం | {{{value}}} |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible)
|
TWA 1 mg/m3[1] |
REL (Recommended)
|
TWA 0.5 mg/m3[1] |
IDLH (Immediate danger)
|
250 mg/m3[1] |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
మూస లూపు కనబడింది: మూస:Cross verify (what is ![]() మూస లూపు కనబడింది: మూస:Cross ?) | |
Infobox references | |
క్రోమియం(III)సల్ఫేట్ ఒక ఆకర్బన రసాయన సంయోగ పదార్ధం.ఇది నిర్జల, ఆర్ద్ర (జలయుత)రూపాల్లో లభిస్తుంది.అందువలన ఈ ఘన సంయోగ పదార్తంయోక్క రసాయన ఫార్ములా Cr2(SO4)3.x(H2O).ఈఈ ఫార్ములాలో Xఅను పదం,సదరు సంయోగపదార్థంలో మిళితమైఉన్న నీటి అణువుల సంఖ్యను తెలుపును.ఈ సంఖ్య1 నుండి 18 వరకు ఉండు అవకాశం ఉంది.ఈ సంయోగ పదార్ధం ఊదా రంగు లేదా పచ్చని రంగులో లభించును.క్రోమియం, సల్ఫర్, ఆక్సిజన్ మూలకాల పరమాణువుల సంయోగం వలన ఈ సంయోగ పదార్థం ఏర్పడినది.
క్రోమియం(III)సల్ఫేట్ రకాలు/రూపాలు[మార్చు]
క్రోమియం(III)సల్ఫేట్ ను క్రింద వివరించ బడిన మూడు రకాలగా వర్గీకరణచెయ్యవచ్చు
- మొదటిరకం: ఇది నిర్జల క్రోమియం సల్ఫేట్(Cr2(SO4)3.ఈ పదార్ధం CAS గుర్తింపు సంఖ్య#10101-53-8.ఇది వైలెట్(ఊదా)రంగులో ఉండును. ఇది నీటిలో కరుగును.దీనికి క్షయికరణకారకాన్ని(reducing agent)చేర్చిన క్రోమియం(II)సల్ఫేట్ ఏర్పడును.
- రెండవరకం/రూపం:18 జలాణువులు వున్న ఆర్ద్ర రూపం,సాధారణ రసాయనిక ఫార్ములా Cr2(SO4)3.18H2O.ఈ ఆర్ద్ర రసాయన పదార్ధం CAS గుర్తింపు సంఖ్య #13520-66-6.ఇది కూడా ఊదా రంగు కల్గిన పదార్థం.నీటిలో త్వరితంగా కరిగే ఈ సంయోగ పదార్ధం నీటిలో కరిగినపుడు మెటల్ ఆక్వా కాంప్లెక్ష్ పదార్థాన్ని[Cr(H2O)6]3+.ఏర్పరచును. 18 జలాణువులున్న ఆర్ద్రరూప పదార్థంలో, ఆరు జలబిందువులు ప్రత్యేకంగా స్పాటికాకృతిలో ఉండును. అందువలన దాని వివరణాత్మకమైన రసాయన ఫార్ములా :Cr(H2O)6]2(SO4)3.6H2O.
- మూడవ సజల/ఆర్ద్ర క్రోమియం సల్ఫేట్ 15 జలాణువులను కల్గిఉన్నది. దీని CAS సంఖ్య 10031-37-5. ఇది ఆకు పచ్చని ఘనరూప పదార్ధం.నీటిలో త్వరితంగా కరుగును. 18 జలాణువులున్న క్రోమియం సల్ఫేట్ ను 70 °C వద్ద వేడి చేసిన 15 జలాణువులున్న ఆర్ద్రక్రోమియం సల్ఫేట్ ఏర్పడును/ఉత్పత్తి అగును.పైన పేర్కొన్న ఉష్ణోగ్రతను మించి అధికంగా వేడిచేసిన నిర్జల క్రోమియం సల్ఫేట్ సంయోగ పదార్ధం ఏర్పడును.
ఇంకా మరికొన్ని క్రోమియం(III)సల్ఫేట్‌గా పిలవబడు సంయోగ పదార్థాలున్నప్పటికి అవి హైడ్రాక్సైడ్‌లను లేదా ఆక్సైడ్ లిగండులను(ligands)కల్గి ఉండును.ముఖ్యంగా వాణిజ్య పరంగా లభించుప్రాథమిక క్రోమియం సల్ఫేట్ [Cr2(H2O)6(OH)4]SO4 రూపంలో ఉంది.దీని CAS సంఖ్య#39380-78-4.హెక్సా హైడ్రేట్‌ను పాక్షిక తటస్థీకరణ (neutralization) చెయ్యడం ద్వారా తయారు చేయుదురు
భౌతిక లక్షణాలు[మార్చు]
భౌతికా కృతి[మార్చు]
నిర్జల సంయోగ పదార్ధం ఎరుపు, గోధుమరంగుల మిశ్రమ రూప స్పటికాకృతిలో ఉండును.
అణుభారం[మార్చు]
నిర్జల సంయోగ పదార్ధం యొక్క అణుభారం లేదా మోలారు బరువు 392.18 గ్రాములు[2].12 నీటి అణువులున్న రసాయనపదార్థ అణుభారం 608.363 గ్రాములు/మోల్. అలాగే 18 జలాణువులున్న పదార్ధం అణుభారం 716.45 గ్రాములు/మోల్.
సాంద్రత[మార్చు]
నిర్జల సంయోగ పదార్ధం యొక్క సాంద్రత 3.10 గ్రాములు/సెం.మీ2[3].15 జలాణువులున్న సంయోగ పదార్ధం సాంద్రత 1.86 గ్రాములు/ సెం.మీ2.అలాగే 18 జలాణువులున్న సంయోగ పదార్ధం సాంద్రత 1.709 గ్రాములు. సెం.మీ2.
ద్రవీభవనఉష్ణోగ్రత[మార్చు]
క్రోమియం (III)సల్ఫేట్ ద్రవీభవన స్థానం 90 °C.
మరుగు/భాష్పిభవన స్థానం[మార్చు]
90 °C మించి వేడి చేసిన క్రోమిక్ ఆమ్లంగా వియోగం చెందును.
ద్రావణీయత[మార్చు]
నిర్జల సంయోగ పదార్ధం నీటిలో కరగదు.అయితే జలాణువులున్న సంయోగ పదార్ధం నీటిలో కరుగును.ఆల్కహాల్లో కరుగును.ఆమ్లాలలో కరుగదు.
ఉత్పత్తి[మార్చు]
వివిధ రకాల సేంద్రియ సమ్మేళన సంయోగ పదార్థాలతో క్రోమేట్‌ల ఆక్సీకరణ వలన ఏర్పడు క్రోమియం(III)వ్యర్థపదార్థాలు క్రోమియం (III)సల్ఫేట్ యొక్క ముఖ్య జనక/ ఉత్పాదకమూల పదార్థాలు.అంత్రాసిన్, ఫెనోల్ లను క్రోమిక్ ఆమ్లంతో రసాయన చర్యకు లోను కావించినపుడు అంత్రాసిన్, ఫెనోల్ ఉత్పత్తి అగును.ఆసమయంలో క్రోమియం(III)ఆక్సైడ్ ఉప ఉత్పత్తిగా ఏర్పడును.ఇలా ఏర్పడిన క్రోమియం ఆక్సైడ్ ను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరిగించి సంగ్రహించెదరు.ఇప్పుడు ఈ ఆమ్లద్రావణాన్ని ఇగుర్చుట వలన జలబిందుయుత(hydrate)క్రోమియం(III)సల్ఫేట్ ఉత్పత్తి అగును. అలాగే క్రోమియం ఖనిజాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కొంత క్రోమేట్ సమక్షములో సంగ్రహించినపుడు, కొన్ని ఇతర లోహమలినాలతో కూడిన క్రోమియం(III)సల్ఫేట్ ద్రావణాన్ని ఇస్తుంది.అలాగే క్రోమియం ధాతువుమిశ్రమాలను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో చర్య నొందించడం వలన కుడా ఫెర్రస్ సల్ఫేట్‌లతో కూడిన క్రోమియం(III)సల్ఫేట్‌ను ఏర్పరచును
మూలమైన/ప్రాథమిక(basic) క్రోమియం (III)సల్ఫేట్ ఉత్పత్తి[మార్చు]
ఇతర ఉత్పత్తి పద్ధతులున్నప్పటికి ప్రాథమిక క్రోమియం సల్ఫేట్]ను సల్ఫర్ డయాక్సైడ్ తో క్రోమియం లవణాలను క్షయికరణ చర్యకు లోను కావించడం వలన ఉత్పత్తి కావించెదరు.
- Na2Cr2O7 + 3 SO2 + H2O → Cr2(SO4)3 + 2NaOH
రసాయన చర్యలు[మార్చు]
క్రోమియం(III)సల్ఫేట్ యొక్క కొన్ని రసాయన చర్యలు[3]
- 3H2S + K2Cr2O7 + 4H2SO4 = Cr2(SO4)3 + K2SO4 + 3S + 7H2O
- 3H2S + K2Cr2O7 + 6KI + 7H2SO4 = 4K2SO4 + Cr2(SO4)3 + 3I2 + 7H2O
- 3H2S + K2Cr2O7 + 6FeSO4 + 7H2SO4 = 3Fe2(SO4)3 + Cr2(SO4)3 + K2SO4 + 7H2O
- 2Cr + 3H2SO4 = Cr2(SO4)3 + 3H2
- 2PbCrO4 + 16HCl + 6FeSO4 = 2PbCl2 + Cr2(SO4)3 + 4FeCl3 + Fe2(SO4)3 + 8H2O
- 3H2S + K2Cr2O7 + 6NaI + 7H2SO4 = Cr2(SO4)3 + 3I2 + 3Na2SO4 + K2SO4 + 7H2O
- Cr2(SO4)3 + 6NaOH = 2Cr(OH)3↓ + 3Na2SO4
- Cr2(SO4)3 + 6KOH = 2Cr(OH)3↓ + 3K2SO4
- Cr2(SO3)3 + 3H2SO4 = Cr2(SO4)3 + 3H2SO3
- 3H2SO4 + 2Cr(OH)3 = Cr2(SO4)3 + 6H2O
ఉపయోగాలు/వినియోగం[మార్చు]
క్రోమియం(III)సల్ఫేట్ ను రంగుల్లో,సిరాలతయారిలో, వస్త్రాల అద్దకంలో ఉపయోగిస్తారు[4].
వాతవరణం పై ప్రభావం[మార్చు]
ఈ రసాయనం వాతావరణంలో కలిసిన దాని ప్రభావం చ్గూపును.కావున వాడు నపుదు వాతవరనంలో కలువకుందా జాగ్రత్తలు తీసుకోవాలి[4]
ఇవికూడా చూడండి[మార్చు]
మూలాలు/ఆధారాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 NIOSH Pocket Guide to Chemical Hazards 0141
- ↑ "Chromium(III) sulfate". chemspider.com. http://www.chemspider.com/Chemical-Structure.23304.html. Retrieved 27-03-2017.
- ↑ 3.0 3.1 "Chromium(III) Sulfate". endmemo.com. http://web.archive.org/web/20170327033710/http://www.endmemo.com/chem/compound/cr2so4_3.php. Retrieved 27-03-2017.
- ↑ 4.0 4.1 "Chromium Sulfate". pubchem.ncbi.nlm.nih.gov. http://web.archive.org/web/20170327032814/https://pubchem.ncbi.nlm.nih.gov/compound/Chromium_sulfate. Retrieved 27-03-2017.