క్లోరిన్ మొనాక్సైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్లోరిన్ మొనాక్సైడ్
పేర్లు
Preferred IUPAC name
Chlorine monoxide
Systematic IUPAC name
Chlorooxidanyl
ఇతర పేర్లు
Chlorine(II) oxide
గుర్తింపు విషయాలు
సంక్షిప్తీకరణ ClO(.)
సి.ఎ.ఎస్. సంఖ్య [12301-79-0]
పబ్ కెమ్ 166686
వైద్య విషయ శీర్షిక Chlorosyl
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:29314
SMILES [O]Cl
ధర్మములు
ClO
మోలార్ ద్రవ్యరాశి 51.45 g·mol−1
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
101.8 kJ/mol
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

క్లోరిన్ మొనాక్సైడ్‌ అనునది ఒక రసాయన రాడికల్ (radical).ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం ClO[1].మొనాక్సైడ యొక్క మోలార్‌మాస్ 51.4524 గ్రాములు/మోల్.[2] క్లోరిన్, ఆక్సిజన్ మూలకాల సమ్మేళనం వలన ఈ సంయోగపదార్ధం ఏర్పడినది.క్లోరిన్ మొనాక్సైడును క్లోరిన్ (II) ఆక్సైడ్ అనికూడా అంటారు.

వాతావరణంలోని ఓజోన్ పొర యొక్క క్షీణతకు, సాంద్రత తగ్గుటకు/నాశనం అగుటకు కారణమైన వాటిలో, ప్రభావం చూపించు రసాయనాలలో క్లోరిన్ మొనాక్సైడు ప్రధానమైనది.

భూవాతావరణంలోని వాయువులలో 24% వరకు ఆక్సిజన్ వాయువు ఉందన్న విషయం తెలిసినదే.వాతావరణంలో ఆక్సిజన్ విడిగాను,, ఇతరమూలకాలతో కలసి మోనాక్సైడు, డయాక్సైడురూపాలలో ఉండును. ఉదాహరణకు కార్బన్ మొనాక్సైడ్ (CO, కార్బన్ డయాక్సైడ్ (CO2) వంటివి .

భూమిఉపరితలం పైన కొన్నికిలోమీటర్ల వరకు వ్యాపించిఉన్నవాయు వాతావరణం ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసొస్పియర్, థెర్మొస్పియర్, ఎక్స్పొస్పియర్ అని విభాజితమైఉన్నది.స్ట్రాటోస్పియరు బయటి వలయంలో ఓజోన్ పొర/ఆవరణం (భూ ఉపరితలం నుండి 10-50కిమీవరకు) ఉంది. ఓజోన్ ఒక అకర్బన సమ్మేళన వాయువు. ఒకే మూలకం యొక్కమూడు అణువుల సంయోగం వలన ఏర్పడిన వాయువు.ఓజోను అనగా మూడు ఆక్సిజన్ పరమాణువుల సమ్మేళనంతో ఏర్పడిన ఆక్సిజన్ అణువు (O3).ఈ ఓజోన్ వాయుతలం సూర్యునినుండి, విశ్వాంతరాళం నుండి భూవాతావరణంలోకి చొచ్చుకు వచ్చు/ప్రవేశించు, భూమిమీది జీవరాశికి ప్రమాదకరమైన పలురకాల కాంతికిరణాలను (ఎక్సు, కిరణాలు, అతిలోహితనీలకిరణాలు, కాస్మిక్ కిరణాలు, ఆల్పా, గామావంటి కిరణాలు) అడ్డుకొని, నిరోధించి వడబోసి, ప్రమాదరహితమైన కాంతి మాత్రమే భువాతావరణం గుండా భూమిపైకి చేరునట్లు చెయ్యును.అందువలన్ ఓజోను పరిరక్షణ మానవాళి మనుగడకు, ఉనికికి అంతో అవసరం.దానిని నాశనం కాకుండా కాపాడుకోవటం మానవాళి బాధ్యత.

వాతావరణంలోని స్ట్రాటోస్పియర్ (stratosphere) ప్రాంతంలో క్లోరిన్ పరమాణువులు ఓజోన్ తో రసాయనచర్య జరపడం వలన క్లోరిన్ మొనాక్సైడు, ఆక్సిజన్ ఏర్పడును.

Cl• + O3 → ClO• + O2

పై చర్యవలన వాతావరణం పైపొరలోని ఓజోను శాతం/గాఢత గణనీయంగా తగ్గి పోతుంది.ఈ రసాయనికప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. ClO• రాడికల్ తిరిగి ఆక్సిజన్‌తో చర్య వలన క్లోరిన్ రాడికల్ ఏర్పడి అది మరల క్లోరిన్ రాడికల్ గా ఏర్పడుతుంది.

ClO• + O• → Cl• + O2

క్లోరిన్ రాడికల్ పునఃఉత్పత్తి కావడం వలన ఓజోన్ పొర వియోగం/క్షీణత క్లోరిన్‌రాడికల్ వలన వేగవంతం చెయ్యబడుతున్నది.ఈ ప్రక్రియలో క్లోరిన్ యొక్క ఉనికి/నిష్పత్తి ఎటువంటి వంటిమార్పు ఉండదు.మొత్తం మీద చర్యాఫలితం దిగువన పేర్కొన్న విధంగా కొనసాగును.

O• + O3 → + 2O2

ఈ కారణంగానే వాతావరణంలోకి విడుదలఅగు CFC (క్లోరో ఫ్లోరోకార్బనులు) వాతావరణంలోని స్ట్రాటోస్పియర్ ప్రాంతంలో చేరు వలన వాతావరణకు ప్రమాదం పొంచిఉన్నది.క్లోరో ఫ్లోరోకార్బనులు (CFC) చర్యారహితమైనవి స్వభావ కారణంగా వాతావరణం లోని స్ట్రాటోస్పియర్ లోకి ప్రవేశించును. ఇక్కడ ఇవి కాంతి ప్రభావ వియోగం (photo-dissociation) వలన క్లోరిన్ రాడికల్ లను ఉత్పత్తి చేయ్యును.ఏర్పడిన ఈక్లోరిన్ రాడికల్ లు క్లోరిన్ మొనాక్సైడులుగా మార్పుచెందును, రెండు రాడికల్‌లు చర్య జరిపి డై క్లోరిన్ డయాక్సైడ్ ఏర్పడు వరకు క్లోరిన్ మొనాక్సైడుఏర్పడు పై చక్రీయచర్య కొనసాగుతూనే ఉండును. భూవాతావరణంలో CFC తక్కువ నిష్పత్తిలో/సాంద్రతలో ఉండటం వలన ఈ చక్రీయచర్యను నిలుపు/ఆపు అవకాశం బాగా తక్కువ, అనగా ప్రతి రాడికల్ వేల ఓజోను అణువులను విచ్చేదం చెయ్యును.

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Chlorine monoxide". easychem.org. Retrieved 2015-08-27.
  2. "Molecular weight of Chlorine Monoxide". convertunits.com. Retrieved 2015-08-27.