ఖడ్గమృగం
భారతీయ ఖడ్గమృగం | |
---|---|
భారతీయ ఖడ్గమృగం (వరుసగా ఎడమనుండి కుడి : శిశువు (మగ), ఆడ మృగం, లేత దశ ఆడమృగం) | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ఆర్. యూనికార్నిస్
|
Binomial name | |
రైనోసెరాస్ యూనీకార్నిస్ | |
భారతీయ ఖడ్గమృగాల పరిధి |
భారతీయ ఖడ్గమృగం (ఆంగ్లం Indian Rhinoceros) లేదా ఒంటి కొమ్ము ఖడ్గమృగం లేదా ఆసియా ఒంటికొమ్ము ఖడ్గమృగం, ఓ పెద్ద క్షీరదం, నేపాల్, భారత్ లోని అస్సాం యందు ఎక్కువగా కానవస్తుంది. హిమాలయాల పాదభాగాలలోని గడ్డిమైదానా లలోను, అడవులలోనూ కానవస్తుంది. భారత ఖడ్గమృగం గంటకు 25 మైళ్ళ వేగంతో పరుగెత్తగలదు. ఇది ఈతలో ప్రావీణ్యం గలది. దీని చూపు చాలా మందం.
ప్రాచీన శిలాజాల కాలపు జంతువులా కనబడే ఈ ఖడ్గమృగం, మందమైన 'వెండి రంగు చర్మాన్ని' గలిగి, వుంటుంది. దీని చర్మపు మడతలవద్ద చర్మం ఎర్రగావుంటుంది. మగజంతువుల మెడపై మందమైన చర్మపు మడతలుంటాయి, దీని శరీరంపై వెండ్రుకలు బహు స్వల్పం.[2]
బంధించి వుంచితే 40 యేండ్లు, స్వేచ్ఛగా వదిలేస్తే 47 యేండ్లు బ్రతుకుతాయి.[2]
వీటికి ప్రకృతిలో శత్రువులు చాలా తక్కువ. పులులు వీటి ప్రధాన శత్రువులు. ఇవి సమూహాలలో లేని దూడలను చంపివేస్తాయి. మానవులు రెండవ శత్రువుల కోవలోకి వస్తారు. మానవులు వీటిని చంపి వీటి శరీరభాగాలను అమ్ముకుంటారు.[2]
పరిధి
[మార్చు]ఈ ఖడ్గమృగాలు, భారతదేశం, పాకిస్తాన్ నుండి బర్మా వరకు, బంగ్లాదేశ్, చైనా వరకు తిరుగుతూంటాయి. ఈశాన్యభారతం, నేపాల్ లో వీటి జనాభా ఉంది.
జనాభా , అపాయాలు
[మార్చు]పందొమ్మిదో శతాబ్దపు ఆఖరులో, ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభ దశలో, వీటిని వేటాడి చంపేవారు. ఆ కాలంలో అస్సాం లోని ఆఫీసర్లు, స్వతహాగా 200 మృగాలను వేటాడి చంపారని రికార్డులు చూపిస్తున్నాయి. 1910 లో వీటి వేట భారతదేశంలో నిషేధింపబడింది.[2]
1900 సం.లో కేవలం 100 మృగాలు మాత్రమే వుండగా, నేటికి వీటి జనాభా 2500 చేరింది. అయిననూ వీటి జనాభా అపాయస్థితిలోనే ఉంది. భారత్, నేపాల్ ప్రభుత్వాలు ప్రపంచ వన్యప్రాణుల ఫండ్ నుండి సహాయం పొంది, వీటిని కాపాడుతున్నాయి.
ఖడ్గమృగాల జనాభా వనరులు : here.
|
చిత్రమాలిక
[మార్చు]-
ఒంటి కొమ్ము ఖడ్గమృగం లేదా రైనోసెరాస్. ప్రపంచంలో అత్యధికంగా ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఇక్కడున్నాయి.
-
ముఖంపై 'ఒంటి ఖడ్గం'.
-
భారతీయ ఖడ్గమృగం.
-
చిట్వాన్ జాతీయ వనం (నేపాల్), యందు ఖడ్గమృగాలు, వాటి వెనుక ఏనుగుల గుంపు.
-
భారతీయ ఖడ్గమృగం, మెట్రో టొరంటో జూ యందు
మూలాలు
[మార్చు]- ↑ Asian Rhino Specialist Group (1996). Rhinoceros unicornis. 2006. IUCN Red List of Threatened Species. IUCN 2006. www.iucnredlist.org. Retrieved on 11 May 2006. Listed as Endangered (EN B1+2cde v2.3)
- ↑ 2.0 2.1 2.2 2.3 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Laurie1983
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
- Dinerstein, Eric (2003), The Return of the Unicorns; The Natural History and Conservation of the Greater One-Horned Rhinoceros, New York: Columbia University Press, ISBN 0-231-08450-1
- Foose, Thomas J. and van Strien, Nico (1997), Asian Rhinos – Status Survey and Conservation Action Plan., IUCN, Gland, Switzerland, and Cambridge, UK, ISBN 2-8317-0336-0
{{citation}}
: CS1 maint: multiple names: authors list (link) - R, Fulconis, ed. (2005). Save the rhinos: EAZA Rhino Campaign 2005/6. London: European Association of Zoos and Aquaria.
బయటి లింకులు
[మార్చు]- Indian Rhino Info & Indian Rhino Pictures[permanent dead link] on the Rhino Resource Center
- Indian Rhino page at International Rhino Foundation website
- Greater Indian Rhinoceros page at TheBigZoo.com
- Indian Rhino page at AnimalInfo.org
- Indian Rhino page at AmericaZoo.com
- Indian Rhinoceros page at nature.ca
- Indian Rhinoceros page at UltimateUngulate.com
- Short narrated video about the Indian Rhinoceros
- Images, videos and information on the Indian Rhinoceros
- Asian Rhino Foundation