Jump to content

క్షీరదాలు

వికీపీడియా నుండి
(క్షీరదం నుండి దారిమార్పు చెందింది)

క్షీరదాలు
Temporal range: Late Triassic–Recent
Scientific classification
Kingdom:
Phylum:
Subphylum:
(unranked):
Class:
Mammalia

Subclasses & Infraclasses

క్షీరదాలు ఆధునిక జీవ మహాయుగంలో అమితంగా విస్తరించిన అంతరోష్ణ భూచర సకశేరుకాలు.

ముళ్ళపంది, ఒక క్షీరదం (Indian Crested Porcupine)
దేవాంగిపిల్లి, ఒక క్షీరదం (Sri Lankan Slender Loris)

సామాన్య లక్షణాలు

[మార్చు]
  • అంతరోష్ణ లేదా స్థిరోష్ణ జీవులు.
  • చర్మము బహిస్తర రోమాలతో కప్పి ఉంటుంది. తిమింగలాల్లో రోమాలు ఉండవు. ముళ్ళపందిలో రోమాలు ముళ్ళ రూపంలో ఉంటాయి.
  • చర్మగ్రంధులు ఉంటాయి. ఇవి క్షీర గ్రంధులుగా రూపాంతరం చెందడం వల్ల ఈ విభాగానికి క్షీరదాలుగా నామకరణం జరిగింది.
  • కండరయుత విభాజక పటలం (Diaphragm) ఉరఃకుహరాన్ని ఉదరకుహరాన్ని వేరుచేస్తుంది.
  • డైకాండైలిక్ కపాలం, కింది దవడ అర్ధభాగం ఒకే ఒక్క ఎముక, దంతస్థితిని కలిగి ఉంటుంది. ఇది కపాలంలో గల శల్కలాస్థితో సంధానింపబడి ఉంటుంది. పూర్వ జంబికలు, జంబికలు కలయిక వల్ల ఎముకతో ఏర్పడిన తాలువు (అంగిలి) ఏర్పడుతుంది. ఇది నాశికా మార్గాన్ని, ఆస్యకుహరాన్ని వేరుచేస్తుంది.
  • ఏడు గ్రీవ కశేరుకాలు (Cervical vertebra) ఉంటాయి.
  • దంతవిన్యాసం విషమదంతి. దంతాలు దవడ ఎముకలో గుంటలలో మదరి ఉంటాయి (ధీకోడాంట్) . బాల్యదశలో గల పాలదంతాల స్థానంలో, ప్రౌఢ దశలో శాశ్వత దంతాలు ఏర్పడతాయి (ద్వివార దంతి) .
  • ఆస్యకుహరంలో నాలుగు జతల లాలాజల గ్రంధులు ఉంటాయి. అవి 1. నిమ్ననేత్రకోటర, 2. పెరోటిడ్, అధోజంబిక, 4. అధో జిహ్వ గ్రంధులు. మానవుడిలో నిమ్ననేత్రకోటర గ్రంధులు ఉండవు.
  • ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. కంఠబిలం ఉపజిహ్వాకతో రక్షింపబడి ఉంటుంది.
  • నాలుగు గదుల గుండె ఉంటుంది. సంపూర్ణ ద్వంద్వ ప్రసరణ జరుగుతుంది. రెండు లయారంబకాలు 1. సిరాకర్ణికా కణుపు (Sino-atrial Node), 2. కర్ణికాజఠరికా కణుపు (Atrio-ventricular Node) .
  • ఎర్ర రక్తకణాలు, కేంద్రక రహిత, ద్విపుటాకార గుండ్రంగా ఉంటాయి
  • మస్తిష్క అర్ధగోళాలు పెద్దవి, ముడుతలను ప్రదర్శిస్తాయి. ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో అడ్డగా పట్టీ వంటి నాడీ పదార్థం (కార్పస్ కల్లోసమ్) ఉంటుంది. అనుమస్తిష్కం పెద్దది, దృఢంగా ఉంటుంది. 12 జతల కపాల నాడులుంటాయి.
  • బాహ్య, మధ్య, అంతర్ చెవి అని మూడు భాగాలుంటాయి.
  • మూత్రపిండాలు అంత్యవృక్కాలు.
  • ముష్కాలు ముష్కకోశాల్లో అమరి ఉంటాయి. కానీ తిమింగలాలు, ఏనుగు లలో ముష్కకోశాలు ఉండవు.
  • అండోత్పాదక మోనోట్రీమ్ లు మినహా క్షీరదాలన్నీ శిశూత్పాదక జీవులు. పెరుగుతున్న పిండం జరాయువు ద్వారా తల్లి గర్బాశయ కుడ్యానికి అతికి పెట్టుకొంటుంది. యూథీరియా జీవులలో ఆళింద జరాయువు కొన్ని శిశుకోశ క్షీరదాఅలలో సొనసంచి జరాయువు ఉంటుంది.
ఈజిప్షియన్ ఫ్రూట్ బ్యాట్ స్లో-మోషన్, సాధారణ వేగం

వర్గీకరణ

[మార్చు]