మార్సుపీలియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Marsupials
Temporal range: Middle Cretaceous - Recent
Kangaroo and joey03.jpg
Female Eastern Grey Kangaroo with a joey in her pouch
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: మూస:Taxonomy/nobreak
విభాగం: మూస:Taxonomy/nobreak
తరగతి: మూస:Taxonomy/nobreak
ఉప తరగతి: మూస:Taxonomy/nobreak
Infraclass: మూస:Taxonomy/nobreak
Illiger, 1811
Orders

మార్సుపీలియా (లాటిన్ Marsupilia) మెటాథీరియాకు చెందిన క్షీరదాల క్రమం. ఇవి ముఖ్యంగా ఆస్ట్రేలియా, పరిసర ద్వీపాలలో ఉంటాయి. అందువల్ల ఆస్ట్రేలియాను 'శిశుకోశ క్షీరదాల భూ'మి (Land of Marsupials) గా వర్ణిస్తారు. కానీ అపోజమ్ మాత్రం అమెరికాలో కనిపిస్తుంది.

సామాన్య లక్షణాలు[మార్చు]

  • ఆడజీవులు శిశుకోశాన్ని (Mausupium) కలిగి ఉంటాయి.
  • అధిజఘనాస్థులు ఉండి, జఘనాస్థికి అతికి ఉంటాయి. అధిజఘనాస్థులు శిశుకోశానికి ఆధారాన్నిస్తాయి.
  • అంసతుండములు, అంతర్ జతృకలు వేర్వేరుగా ఉంటాయి.
  • దవడ ప్రతీ అర్ధభాగంలో మూడు కంటే ఎక్కువ కుంతకాలు ఉంటాయి.
  • కార్పస్ కల్లోజమ్ అస్పష్టంగా ఉంటుంది.
  • పాయువు, మూత్రజననేంద్రియ రంధ్రం ఒకే సంవరణి ద్వారా పనిచేస్తాయి.
  • రెండు యోనులు, గర్భాశయాలు ఉంటాయి (డైడెల్ఫిక్ స్థితి).
  • శిశూత్పాదక జీవులు, సొనసంచి జరాయువు ఉంటుంది.
  • అతి తక్కువ గర్భావధికాలం ఉంటుంది. పిల్లజీవులు అత్యంత అపరిపక్వత దశలో జన్మిస్తాయి. నగ్నంగా, చూపులేకుండా ఉంటాయి.

వర్గీకరణ[మార్చు]