వృషణం
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
వృషణం (testicle) | |
---|---|
Inner workings of the testicles. | |
Diagram of male (human) testicles | |
లాటిన్ | testis |
గ్రే'స్ | subject #258 1236 |
ధమని | Testicular artery |
సిర | Testicular vein, Pampiniform plexus |
నాడి | Spermatic plexus |
లింఫు | Lumbar lymph nodes |
మానవులలో పురుష జననేంద్రియాలు సంస్కృతంలో- వృషణాలు లేదా ముష్కాలు (ఆంగ్లం: testis) . స్త్రీలలో అండకోశాలవలె పురుషులలో వీర్య కణాలు ఇందులో తయరవుతాయి. ఇవి రెండు ఒక చర్మపు సంచి (ముష్క కోశం) లో పురుషాంగము క్రింద మానవుని శరీరం వెలుపల వ్రేలాడుతూ ఉంటాయి. వృషణాలు మనిషి శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువగా ఉంటే సరిగా పనిచేస్తాయి. అందుకే యీ ఏర్పాటు చేయబడింది. అన్ని సకశేరుకాలలో ఇవి ఉదరములో ఉంటాయి.
నిర్మాణం
వృషణాలు ఒక్కొక్కటి 14 - 35 చదరపు సె.మీ. పరిమాణంలో ఉంటాయి. ప్రతి ముష్కములో అనేక సంఖ్యలో శుక్రోత్పాదక నాళిక (Semeniferous tubules) లను కలిగివుండి వాటి మధ్యలో మధ్యాంతర కణాలు లేదా లీడిగ్ కణాలు (Leydig cells) ఉంటాయి. ముష్కాలలోని నాళికల నుండి శుక్ర కణాలు (Spermatozoa) తయారౌతాయి. లీడిగ్ కణాలు పురుష హార్మోను టెస్టోస్టిరోన్ (Testosterone) స్రవిస్తాయి.
వృషణాల ధర్మాలు
వృషణాలు పురుష జననేంద్రియ వ్యవస్థలో భాగంగా, వినాళ గ్రంధులుగా పనిచేస్తాయి.
- ప్రత్యుత్పత్తి ప్రధానమైన శుక్ర కణాలు (spermatozoa) తయారుచేస్తాయి.
- పురుష సెక్స్ హార్మోన్లు, ముఖ్యంగా టెస్టోస్టిరోన్ తయారుచేస్తాయి.
ఈ రెండు ధర్మాలు పియూష గ్రంధి నుండి విడుదలయ్యే గొనడోట్రోపిక్ హార్మోన్లు మీద ఆధారపడి తయారౌతాయి.
వృషణాల వ్యాధులు
వృషణాలు బయట ఉండడం మూలంగా దెబ్బలు తగలడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉండి నరాల ద్వారా కడుపులోనికి వెళ్తుంది.
- వేరికోసిల్ : వృషణాల సిరల వాపు.
- క్షయ, ఫైలేరియా క్రిముల మూలంగా వృషణాలు వాచి నొప్పి వస్తుంది.
- వృషణాల కాన్సర్ ఎక్కువగా యువకులలో వస్తుంది. ఇది చాలా ప్రమాదమైనది.
- స్పెర్మాటిక్ కార్డ్, వృషణాలు తాడులాగా మడతపడితే టార్షన్ (Torsion) అంటారు.
- స్పెర్మాటిక్ కార్డ్ లోని రక్త నాళాలు ఉబ్బి రక్తం నిలిచిపోవడాన్ని వేరికోసీల్ (Varicocele) అంటారు.[1]
- క్రిప్టార్కిడిజమ్ (Cryptorchidism) అనగా వృషణాలలో ఒకటి గాని రెండు గాని బయటకు కనిపించకుండా ఉండడం. పిండాభివృద్ధిలో వృషణాలు క్రిందికి దిగడంలో అవాంతరం ఏర్పడినప్పుడు అవి కడుపులో గాని, గజ్జలలో గాని ఆగిపోవచ్చును. సుమారు 3 శాతం పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువులలో, 30 శాతం పాక్షికంగా అభివృద్ధి చెందిన శిశువులలో ఈ విధమైన లోపం కనిపిస్తుంది. ఇందువలన జననేంద్రియాలలో జన్మతహా వచ్చే లోపాలలో ఇది అతి సాధారణమైనది. అయితే బాగా అరుదుగా కొందరిలో వృషణాలు పూర్తిగా లేకపోవచ్చును. దీనిని ఎనార్కియా (Anorchia) అంటారు.
- వరిబీజం, వృషణాల పరిమాణము పెరుగుదల
చిత్ర మాలిక
-
వృషణం
-
వృషణం
-
Testicle hanging on cremaster muscle. These are two healthy testicles. Heat causes them to descend, allowing cooling.
-
A healthy scrotum containing normal size testes. The scrotum is in tight condition. The image also shows the texture.
-
Testicle of a cat: 1: Extremitas capitata, 2: Extremitas caudata, 3: Margo epididymalis, 4: Margo liber, 5: Mesorchium, 6: Epididymis, 7: testicular artery and vene, 8: Ductus deferens
-
Testis surface
-
వృషణం అడ్డుకోత
-
The right testis, exposed by laying open the tunica vaginalis.
-
సూక్ష్మదర్శిని సహాయంతో చూపబడిన కుందేలు వృషణం 100×
-
వృషణం
మూలాలు
- ↑ "Varicocele". Archived from the original on 2008-09-23. Retrieved 2008-10-16.