ఖమ్మం పోలీస్ కమీషనరేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖమ్మం పోలీస్ కమీషనరేట్
Khammam Police Commissionerate.jpg
ఖమ్మం పోలీస్ కమీషనరేట్ భవనం
మామూలుగా పిలిచే పేరుఖమ్మం నగర పోలీస్
Agency overview
ఏర్పాటు2016
ఉద్యోగులుకమీషనర్ ఆఫ్ పోలీస్
డిప్యూటి కమీషనర్
అడిషనల్ డిప్యూటి కమీషనర్
పోలీస్ ఇన్స్పెక్టర్స్
అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్స్
సబ్ పోలీస్ ఇన్స్పెక్టర్స్
Jurisdictional structure
Operations jurisdictionఖమ్మం జిల్లా, భారతదేశం
Legal jurisdictionఖమ్మం
Primary governing bodyతెలంగాణ ప్రభుత్వం
Secondary governing bodyతెలంగాణ రాష్ట్ర పోలీస్
ప్రధాన కార్యాలయంఖమ్మం, తెలంగాణ
Agency executive
  • విష్ణు ఎస్ వారియర్‌ ఐపిఎస్, పోలీసు కమీషనర్
Parent agencyతెలంగాణ రాష్ట్ర పోలీస్
Facilities
Stations29 పోలీస్ స్టేషన్లు

ఖమ్మం పోలీస్ కమిషనరేట్, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో ఉన్న పోలీసు కమీషనరేట్. ఖమ్మం ప్రాంతంలో చట్ట అమలుకు, దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న ఒక పోలీసు విభాగం.[1] ప్రస్తుత పోలీసు కమిషనర్ గా విష్ణు ఎస్ వారియర్‌ ఐపిఎస్ విధులు నిర్వర్తిస్తున్నాడు.[2]

చరిత్ర[మార్చు]

2016 అక్టోబరులో ఖమ్మం పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ఖమ్మంలో హెడ్ క్వార్టర్స్‌తో ఈ కమీషనరేట్ ఏర్పడింది. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ అధికార పరిధి 4,360 చ.కి.మీ. కాగా, జనాభా సుమారు 1,389,566. మంది ఉన్నారు. ఈ కమీషనరేట్‌ పరిధిలో 3 సబ్ డివిజన్లు, 9 సర్కిళ్ళు, 29 - పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.

జోన్స్[మార్చు]

ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో ప్రస్తుతం మూడు డిసిపి జోన్స్ ఉన్నాయి.[3]

ఖమ్మం జోన్[మార్చు]

  1. ఖమ్మం టౌన్: ఖమ్మం వన్ టౌన్, ఖమ్మం టూ టౌన్, ఖమ్మం త్రీ టౌన్, ఖమ్మం ట్రాఫిక్, మహిళా పిఎస్, సిసిఎస్, ఖానాపూర్ హవేలీ, పిసిఆర్ కొత్తగూడెం, రఘునాథపాలెం
  2. ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్, ముదిగొండ, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలైపాలెం
  3. ఇల్లందు రూరల్: కారేపల్లి, కామేపల్లి

వైరా[మార్చు]

  1. వైరా: వైరా, తల్లాడ, కొనిజెర్ల, చింతకాని
  2. మధిర: మధిర టౌన్, మధుర రూరల్, బోనకల్, ఎర్రుపాలెం

సత్తుపల్లి[మార్చు]

  1. సత్తుపల్లి రూరల్: వి.ఎం. బంగీర, కల్లూరు, వేంసూర్, ఏన్కూర్

కమీషనరేట్ భవనం[మార్చు]

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం కోసం కొత్త భవనాన్ని నిర్మించారు. అద్దాలు, ఆర్కిటెక్చర్‌తో చాలా ఆకర్షణీయంగా నిర్మించిన ఈ కమిషనరేట్ చుట్టూ సిసి కెమెరాలు ఉన్నాయి. ఈ కమిషనరేట్ కార్యాలయం నుండి ఖమ్మం మార్కెట్ యార్డ్ వైపు ఒక గేట్, ప్రకాష్ నగర్ వంతెనల సమీపంలో రెండవ గేట్ ఉన్నాయి. ఈ కార్యాలయం హై క్లాస్ ఫెసిలిటీస్, ఆధునిక టెక్నాలజీతో నిర్మించబడింది.

మూలాలు[మార్చు]

  1. "Khammam made police commissionerate - The Hindu". thehindu.com. Retrieved 2016-10-11.
  2. నమస్తే తెలంగాణ, ఖమ్మం (14 September 2021). "పోలీస్ కమిషనర్‌ను కలిసిన వైరా ఏసీపీ స్నేహామెహ్రా…". Namasthe Telangana. Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
  3. "Telangana State Police". www.tspolice.gov.in. Retrieved 2021-09-23.