గ్రామ నామం
జనసముదాయాలకు ఉండే పేర్లను గ్రామ నామం అంటారు. ఊళ్ళ పేర్లని వ్యవహరించే వీటిని మౌలికంగా వేర్వేరు గ్రామాలను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. పలువురు చరిత్రకారులు గ్రామ నామాల వెనుక ఆయా గ్రామాల చరిత్ర, సంస్కృతి వంటివి ఉంటాయని భావించారు.
గ్రామ నామాధ్యయనం
[మార్చు]గ్రామనామాధ్యయనం స్థలనామాధ్యయనంలో ఒక భాగం. ఊళ్ల పేర్లకు అర్థాలు, వాటి వెనుక ఉన్న విషయాలు తదితర గ్రామనామాల సర్వవిశేషాలను అధ్యయనం చేయడం గ్రామనామాధ్యయనం అవుతుంది. గ్రామనామాలు ఏర్పడడంలో చారిత్రిక, భౌగోళిక, సామాజికాది అంశాలు ఎన్నో ఉంటాయి.
వర్గీకరణ
[మార్చు]గ్రామనామాల్లోని పదాల సంఖ్య
[మార్చు]గ్రామాల పేర్లలోని పదాల సంఖ్యను ఆధారం చేసుకుని గ్రామనామాలను విభజించవచ్చు.
- ఒక పదంతో ఏర్పడిన గ్రామనామాలు: ఒక పదంతో ఏర్పడిన పేర్లు కూడా ఉన్నాయి. ఉదా: అత్తిలి, దర్శి, తడ, కంభం.
- రెండు పదాలతో ఏర్పడిన గ్రామనామాలు: తెలుగువారి గ్రామాల పేర్లు సాధారణంగా రెండు పదాలతో ఏర్పడుతుంటాయి. ఉదా: కంచుమర్రు (కంచు, మర్రు), పాలమూరు (పాలము, ఊరు), గండికోట (గండి, కోట) వగైరా.
- మూడు పదాలతో ఏర్పడిన గ్రామనామాలు: పేరులో మూడు పదాలు ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఉదా: దొంగల గన్న వరం (దొంగల, గన్న, వరం), తూర్పు లంక పల్లి (తూర్పు, లంక, పల్లి).
- నాలుగు పదాలతో ఏర్పడిన గ్రామనామాలు: నాలుగు పదాలతో కూడిన పేర్లున్న గ్రామాలు. ఉదా: నీళ్ళు లేని తిమ్మా పురం.
గ్రామనామాల వ్యుత్పత్తి
[మార్చు]గ్రామనామాల వ్యుత్పత్తి వెనుక ఆయా గ్రామాల సంస్కృతి, చరిత్ర మొదలైనవి ఉంటాయి. గ్రామనామాలు ఏర్పడడం వెనుక ఆ ఊళ్ళకు సంబంధించిన చారిత్రికాంశాలు, భౌగోళికాంశాలు, సామాజిక చరిత్ర,
గ్రామనామాల కాలక్రమం
[మార్చు]భారతీయ ప్రదేశ నామాల అధ్యయనం కాలక్రమంలో ఐదు దశలకు చెందినదిగా ఉంటుంది.
పూర్వచారిత్రిక దశ
[మార్చు]చారిత్రికాధారాలు విరివిగా లభ్యం కాకున్నా అప్పటికే కొన్ని ప్రాంతాల్లో చాలానాళ్ల ముందే జాతి, భాష, సంస్కృతి వంటి సంక్లిష్టమైన మానవ ప్రగతి సాధ్యపడిన దశ అది. ఆ దశకు చెందినవిగా గుర్తించిన పలు గ్రామనామాలు చారిత్రిక అవశేషాలుగా ఎంతో కీలకమైనవి. నదులు, అరణ్యాలు, కొండలు వంటి ప్రకృతిసిద్ధమైన ప్రదేశాల పేర్లు అప్పటివే నేటికీ చాలావరకూ కొనసాగుతున్నాయి. కానీ నాగరికత, మానవ జీవనంలో జరిగే విపరీతమైన మార్పుల వల్ల గ్రామాల పేర్లు అలా కొనసాగే అవకాశం తక్కువ. అయినా కాలప్రవాహానికి నిలిచి పలు గ్రామాలు, పట్టణాల పేర్లు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. వేంగి, వేలంగి, చొల్లంగి, రేలంగి, అన్నంగి, పోరంకి వంటి గ్రామాల పేర్లు ఆ ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నవే.[1] గ్రామనామాల్లో ఉత్తరపదంగా ప్రయోగం ఉన్న లంక కూడా పూర్వచారిత్రిక యుగానికి చెందినదిగా నిర్ధారించారు.
ప్రాక్తన చారిత్రిక దశ
[మార్చు]ప్రాక్తన చారిత్రిక దశ కొత్త రాతియుగం, బృహత్ శిలాయుగానికి చెందినది. కొత్తగా దేశంలోని వివిధ ప్రాంతాలతో వర్తక వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి. ఈ యుగంలో రాగి, ఇనుము కనుగొనడంతో వాటిని ఉపయోగిస్తూ లోహపరిశ్రమను ప్రారంభించారు. వ్యవసాయం విస్తృతం కావడమూ ఇదే దశలో ప్రారంభించింది. ఈ విషయాలన్నీ గ్రామనామాల్లో ప్రతిబింబించాయి.
ఖుర్ద్, కలాన్
[మార్చు]ఒక గ్రామం లేదా పట్టణం లోని రెండు విభాగాలను సూచించడానికి ఖుర్ద్, కలాన్ అనే పేర్లను వాడుతారు. చిన్న విభాగాన్ని ఖుర్ద్ అని, పెద్ద విభాగాన్ని కలాన్ అనీ అంటారు. గ్రామం/పట్టణం పేరు తరువాత వీటిని చేరుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాలోని వాంకిడి ఖుర్ద్, వాంకిడి కలాన్.[2]
ఖండ్రిక, కండ్రిగ, కండ్రిక, ఖండ్రిగ
[మార్చు]కండ్రిగ, కండ్రిక, ఖండ్రిగ, ఖండ్రిక అంటే పన్ను లేకుండా గుత్త కిచ్చిన భూఖండం. అలాంటి గ్రామాలకు పేరు చివర ఖండ్రిక/ఖండ్రిగ/కండ్రిక/కండ్రిగ అనే పదాన్ని చేరుస్తారు. ఉదాహరణకు చక్రాచార్యులవారి ఖండ్రిక, కలంబొట్లవారి ఖండ్రిక.
పూర్వ పదాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం:పి.వి.పరబ్రహ్మశాస్త్రి:ఎమెస్కో బుక్స్:2013 ప్రచురణ:పేజీ.23
- ↑ "Reorganisation of Mandals in Komarambhim District".