గండికోట రిజర్వాయర్
గండికోట రిజర్వాయర్ ఆంధ్ర ప్రదేశ్ లో పెన్నా నది మీదుగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కాల్వ నుంచి నీరు అందుతుంది. ఇది కడప జిల్లాలోని గండికోట గ్రామం, కొండాపూర్ గ్రామం మధ్య ఉంది[1].
వివరాలు
[మార్చు]జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది 22 సెప్టెంబర్ 2013న ప్రారంభించబడింది.[2] 26.84టిఎంసి స్థూల నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ పెన్నా నది బేసిన్‌లో ఉంది. ఈ జలాశయం కడప జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలలోని పెన్నా నది పరీవాహక ప్రాంతాలకు కృష్ణా నది నీటిని సరఫరా చేయడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పనిచేస్తుంది.
నీటిపారుదల
[మార్చు]గండికోట లిఫ్ట్ నీటిపారుదల పథకం కూడా ఈ రిజర్వాయర్‌లో భాగమే. ఈ పథకంలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశ పులివెందుల బ్రాంచ్ కెనాల్ కి నీటిని సరఫరా చేయడం,[3] రెండవ దశలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి నీటిని సరఫరా చేయడం.[4]
ప్రజల స్థానభ్రంశం
[మార్చు]ఈ ప్రాజెక్టు వల్ల అనేక గ్రామాలలో దాదాపు 43,200 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తమ గ్రామాలు మునిగిపోవడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారని, మరికొందరు తమ భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.[5] డిసెంబర్ 2020లో, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తొలగింపులపై స్టే కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ను తోసిపుచ్చింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Yeddula Eswaraiah GandiKoata Dam D06208". India-wris.nrsc.gov.in. Archived from the original on 2017-02-02. Retrieved 2022-08-06.
- ↑ "Krishna water released into Gandikota reservoir". Thehindu.com.
- ↑ "CM releases water to Pulivendula canal". Thehindu.com. 12 January 2017. Retrieved 20 November 2021.
- ↑ "GANDIKOTA LIFT IRRIGATION SCHEME". Irrigationap.cgg.gov.in. Archived from the original on 2022-07-05. Retrieved 2022-08-06.
- ↑ "Gandikota Reservoir in AP Submerges 6 Villages, People Yet to be Rehabilitated". www.landconflictwatch.org. Archived from the original on 2020-12-18. Retrieved 2022-06-09.
- ↑ "Pandillapalli Obula Reddy vs The State Of Ap on 14 December, 2020". Indian Kanoon. Retrieved 2022-06-09.
{{cite web}}
: CS1 maint: url-status (link)