Jump to content

గడల శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
గడల శ్రీనివాసరావు
జననం1975
విద్యఎంబీబీఎస్‌
వృత్తితెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరక్టర్‌
క్రియాశీల సంవత్సరాలుమే 2018 - 2023 డిసెంబర్
జీవిత భాగస్వామిగాయత్రి స్వరూప్
పిల్లలుసిద్ధి ఆకాంక్ష
తల్లిదండ్రులుగడల సూర్యనారాయణ, సత్యవతి

గడల శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి. ఆయన మే 2018 నుండి 2023 డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరక్టర్‌గా విధులు నిర్వహించాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

గడల శ్రీనివాసరావు 1975లో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, తనికెళ్ల గ్రామంలో గడల సూర్యనారాయణ, సత్యవతి దంపతులకు జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్య అంతా ఇంట్లోనే పూర్తి చేసి తర్వాత, నేరుగా అశ్వాపురంలో ఆరో తరగతిలో చేరి, భద్రాచలం, ఏన్కూరులో రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఏడో తరగతిలో చేరి హైస్కూల్‌ విద్య పూర్తి చేశాడు.[2] శ్రీనివాసరావు ఖమ్మంలోని శారదా కాలేజీలో ఇంటర్మీడియట్ (బైపీసీ) లో చేరి ఎంసెట్‌లో 439వ ర్యాంక్‌ సాధించాడు. ఆయన తరువాత ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చేసి, తర్వాత పీజీ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

గడల శ్రీనివాసరావు ఎంబీబీఎస్‌ తర్వాత ప్రజారోగ్య రంగంలో స్పెషలైజేషన్‌ కోర్స్ పూర్తి చేసి ప్రభుత్వ సర్వీస్‌లో చేరి ఉస్మానియా మెడికల్‌ కాలేజీ పబ్లిక్‌ హెల్త్‌ కమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. ఆయన వరంగల్‌లో 2004లో మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌గా, ఎన్‌హెచ్‌ఎం ఫస్ట్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌గా, సెక్రటేరియట్ లో ప్రిన్సిపాల్ సెక్రటరీ పీవీ రమేష్ దగ్గర ఓఎస్డిగా పలు హోదాల్లో పనిచేసి 2018లో పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు.[3] గడల శ్రీనివాసరావు ప్రజారోగ్య సంచాలకుడిగా ఉన్న సమయంలో కోవిడ్ 19 పరిస్థితులను సమర్ధవంతంగా నిర్వహించాడు.[4][5] గడల శ్రీనివాసరావును 2023 డిసెంబరు 20న తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ పదవి నుండి ప్రభుత్వం బదిలీ చేసింది.[6][7][8][9][10]

జీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌

[మార్చు]

గడల శ్రీనివాసరావు తన తండ్రి గడల సూర్యనారాయణ మరణాంతరం ఆయన జ్ఞాపకార్థం జీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట ట్రస్ట్‌ను స్థాపించి ద్వారా పేద విద్యార్థులకు విద్య, వైద్యం, ఉపాధి మార్గాలు, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.[11][12][13]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (29 June 2021). "ఆ రోజు..నాన్న కొట్టకపోతే!". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  2. Eenadu (13 February 2022). "గురువులే ప్రత్యక్ష దేవతలు". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  3. The Pynr (2021). "Public health is public wealth" (in ఇంగ్లీష్). Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  4. Andhra Jyothy (4 May 2021). "రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే టీకా!". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  5. Sakshi (30 September 2020). "ఎన్నికలొస్తున్నాయ్‌ జాగ్రత్త!". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  6. Andhrajyothy (21 December 2023). "రమేశ్‌రెడ్డి, గడల ఔట్‌". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  7. A. B. P. Desam (20 December 2023). "గడల శ్రీనివాసరావుకు షాకిచ్చిన కాంగ్రెస్ సర్కార్ - అప్రాధాన్య పోస్టుకు బదిలీ !". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  8. Andhrajyothy (1 August 2024). "మహబూబాబాద్‌ ఏడీపీహెచ్‌వోగా గడల". Archived from the original on 13 August 2024. Retrieved 13 August 2024.
  9. Eenadu (13 August 2024). "మాజీ డీహెచ్‌ శ్రీనివాసరావు స్వచ్ఛంద పదవీ విరమణ". Archived from the original on 13 August 2024. Retrieved 13 August 2024.
  10. NT News (13 August 2024). "'గడల' గుడ్‌ బై". Archived from the original on 13 August 2024. Retrieved 13 August 2024.
  11. Andhra Jyothy (12 February 2022). "గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం, విద్య అందించేందుకే జీఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  12. Prabha News (22 February 2022). "గూడెంపై గురిపెట్టిన శ్రీనివాసరావు.. ప్రత్యక్ష రాజకీయాలే లక్ష్యం". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  13. Andhra Jyothy (5 March 2022). "అధ్యక్షా.. అనాలని!". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.