Jump to content

గడ్డం ఆత్మచరణ్ రెడ్డి

వికీపీడియా నుండి
గడ్డం ఆత్మచరణ్ రెడ్డి
గడ్డం ఆత్మచరణ్ రెడ్డి
నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం మాజీ పార్లమెంట్ సభ్యుడు
In office
1996–1998
అంతకు ముందు వారుగడ్డం గంగారెడ్డి
తరువాత వారుగడ్డం గంగారెడ్డి
వ్యక్తిగత వివరాలు
జననం(1950-05-15)1950 మే 15
పడ్కల్, జక్రాన్ పల్లి మండలం, నిజామాబాదు జిల్లా, తెలంగాణ
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిఅమృతారెడ్డి
సంతానంఒక కుమారుడు, ఒక కుమార్తె
తల్లిదండ్రులుశ్రీనివాస్ రెడ్డి

గడ్డం ఆత్మచరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1996 నుండి 1998 వరకు నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం, విద్య

[మార్చు]

ఆత్మచరణ్ రెడ్డి 1950, మే 15న తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, జక్రాన్ పల్లి మండలంలోని పడ్కల్ గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు శ్రీనివాస్ రెడ్డి. ఆత్మచరణ్ రెడ్డి నాగపూర్ లోని పి.కె.వి.లో బిఎస్సీ (అగ్రికల్చర్.), బి.ఎస్., ఎం.ఎస్. చదివాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలబామాలోని టుస్కేగీ ఇన్స్టిట్యూట్, హంట్స్‌విల్లే యూనివర్సిటీలో చదివాడు. ఎం.ఎస్. చదువుతున్నప్పుడు కాల్షియం, విటమిన్-డి జీవక్రియను, కొలెస్ట్రాల్ జీవక్రియపై థీసిస్ వంటి అంశాలసై పలు పరిశోధన పత్రాలను సమర్పించాడు. పోషకాహారంపై వార్తాపత్రికల్లో వ్యాసాలు కూడా రాశాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆత్మచరణ్ రెడ్డికి అమృతారెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో (11వ లోక్‌సభ) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండవ వెంకటేశ్వర రావుపై 43,599 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 1998 ఎంపీగా వరకు పనిచేశాడు.[3] తరువాత భారతీయ జనతా పార్టీలో చేరాడు. 1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో (12వ లోక్‌సభ) టిడిపి నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం గంగారెడ్డి చేతిలో 32,756 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ఎన్నికల వివరాలు (1996)

[మార్చు]

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం

  • మొత్తం ఓటర్లు 11,34,641
  • మొత్తం పోలైన ఓట్లు 6,98,512
  • మొదటి నలుగురు ప్రధాన అభ్యర్థులు:
    • ఆత్మచరణ్ రెడ్డి (కాంగ్రెస్) 2,93,244
    • మండవ వెంకటేశ్వర రావు (తెలుగుదేశం పార్టీ) 2,49,645
    • హంభంత్ పి. రెడ్డి (బి.జె.పి.) 64,495
    • వేముల సురేందర్ రెడ్డి (ఎన్.టి.ఆర్. టిడిపి) 26,773

నిర్వర్తించిన పదవులు

[మార్చు]

1995: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడు[4]

మూలాలు

[మార్చు]
  1. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-11-19. Retrieved 2021-12-11.
  2. "Shri Atmacharan Reddy MP biodata Nizamabad | ENTRANCEINDIA". www.entranceindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-28. Archived from the original on 2021-12-11. Retrieved 2021-12-11.
  3. "కాంగ్రెస్‌ కంచుకోట.. ఇందూరు". m.andhrajyothy.com. 2019-03-27. Archived from the original on 2021-12-11. Retrieved 2021-12-11.
  4. "Presidents of ATA". American Telugu Association. Archived from the original on 2021-12-11. Retrieved 2021-12-11.