గడ్డం రంజిత్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గడ్డం రంజిత్ రెడ్డి

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
  2019-2024
ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి
నియోజకవర్గం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబరు 18, 1964
వరంగల్, తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి సీతారెడ్డి[1]
నివాసం చేవెళ్ళ, తెలంగాణ

గడ్డం రంజిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, చేవెళ్ళ లోక్‌సభ సభ్యుడు.[2]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

ఈయన 1964, సెప్టెంబర్ 18వరంగల్ లో జన్మించాడు. ఈయన వృత్తిరీత్యా వైద్యుడు. ఈయన ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుంచి వెటర్నరీ సైన్స్‌ విభాగంలో పీజీ పట్టాను పొందాడు.[3]

రాజకీయ విశేషాలు

[మార్చు]

2019 లో జరిగిన 17 వ లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పై 14,772 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4][5] 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదలైన అనంతరం 2024 మార్చి 17న రంజిత్ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (26 August 2023). "ఎంపీ రంజిత్‌రెడ్డి సతీమణికి టీటీడీ పాలకమండలిలో చోటు". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-15. Retrieved 2019-07-15.
  3. https://m.sakshi.com/news/politics/gaddam-ranjith-reddy-chevella-trs-mp-candidate-face-future-1177688
  4. https://www.bbc.com/telugu/india-48345983
  5. http://www.tnews.media/2019/05/గులాబీశ్రేణుల-సంబురాలు/[permanent dead link]
  6. Eenadu (17 March 2024). "భారాసకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  7. Andhrajyothy (17 March 2024). "బీఆర్ఎస్‌కు ఎంపీ రంజిత్ రెడ్డి గుడ్‌బై.. కార‌ణమిదే?". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.