గడ్డం శ్రీనివాస్ యాదవ్
గడ్డం శ్రీనివాస్ యాదవ్ | |||
హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2005 - 2011 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1968 అక్టోబర్ 28 గౌలిగూడ చమన్, గోషామహల్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | స్వర్ణలత | ||
సంతానం | డాక్టర్ స్నేహ, గగన్ యాదవ్ | ||
నివాసం | 15/3-406, షిరిడీ లాడ్జ్ పక్కన, గౌలిగూడ చమన్, హైదరాబాద్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరపున హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]గడ్డం శ్రీనివాస్ యాదవ్ 1968 అక్టోబర్ 28న హైదరాబాద్‌లో జన్మించాడు. ఆయన కాచిగూడలోని నృపతుంగ ఉన్నత పాఠశాలలో 1985లో పదవ తరగతి, నల్లకుంటలోని సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, 1992లో హైదరాబాద్‌లోని రామ్‌కోటిలో ఉన్న ప్రగతి డిగ్రీ కళాశాల నుండి బీకామ్ పూర్తి చేశాడు. ఆయనకు భార్య స్వర్ణలత యాదవ్, కూతురు డాక్టర్ గడ్డం స్నేహ యాదవ్, కుమారుడు గడ్డం గగన్ యాదవ్ ఉన్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]గడ్డం శ్రీనివాస్ యాదవ్ 1989లో విద్యార్థి జీవితం నుండి రాజకీయాలకు ఆకర్శితుడై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ)లో చేరి ఎన్‌ఎస్‌యూఐ హైదరాబాద్ నగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇన్‌చార్జిగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆలిండియా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేసి 2006 సంవత్సరంలో హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితుడై 2011 వరకు పని చేశాడు.
శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తన తండ్రి గడ్డం గంగాధర్ యాదవ్ పేరిట ఫౌండేషన్‌ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఆశించగా ఆయనకు 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మార్చి 25న హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (25 March 2024). "హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే." (in Telugu). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NT News (26 March 2024). "సేవా మూర్తి మన శ్రీనన్న.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌యాదవ్". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
- ↑ Eenadu (26 March 2024). "భారాస అభ్యర్థి శ్రీనివాస్‌యాదవ్ ఎవరంటే." Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.