Jump to content

గడ్డి గులాబి

వికీపీడియా నుండి
ఎర్ర గడ్డి గులాబి
తెల్ల గడ్డి గులాబి

గడ్డి గులాబి అందంగా ఉండే ఒక పూలమొక్క. దీనిని పూలకుండీ లేదా ఖాళీ స్థలంలో పెంచుతారు. వీటికి పూచే పువ్వులు అందంగా చిన్న గులాబి పువ్వులవలె ఉంటాయి. గడ్డి గులాబీలు అనేక రకాలున్నాయి. ఇవి ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం రంగు పువ్వులను పూస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనని అన్ని ప్రాంతాలలోని ఇళ్ళలో వీటిని పెంచుతారు. ఇవి నేలపై సాధారణంగా వెడల్పుగా 20 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి, వీటి కొమ్మలు చాలా మృదువుగా వాలిపోయే లక్షణాలు ఉండటం వలన ఎక్కువ ఎత్తు పెరగలేవు. ఈ మొక్క ఆకులు చాలా చిన్నవిగా ప్రత్యేకంగా అందంగా మృదువుగా ఉంటాయి. ఈ టేబుల్ రోజ్ మొక్కలు ఇంటి ముంగిట్లోనూ, కార్యాలయాల్లోనూ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.

ప్రత్యుత్పత్తి

[మార్చు]

సాధారణంగా వీటి కొమ్మను తుంచి నాటడం ద్వారా కొత్త మొక్కలను విరివిగా పెంచుకోవచ్చు. ఎలాంటి లాండ్‌స్కేప్‌లోనైనా అత్యంత సహజంగా ఇమిడిపోయి అందరి దృష్టినీ ఇట్టే ఆకట్టుకుంటాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గులాబి

బయటి లింకులు

[మార్చు]

గడ్డి గులాబీలు