Jump to content

గడ్డెన్న వాగు

వికీపీడియా నుండి
గడ్డెన్న వాగు
అధికార నామంగడ్డెన్న వాగు
దేశంభారత దేశం
ప్రదేశంభైంసా
ఆవశ్యకతసాగు నీరు
స్థితిపని చేస్తోంది
నిర్మాణం ప్రారంభం2000
ప్రారంభ తేదీ2006
నిర్మాణ వ్యయం20.33 కోట్లు
యజమానితెలంగాణ రాష్ట్రం
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుసుద్దవాగు
Elevation at crest350.7 మీ.[1]
జలాశయం
పరీవాహక ప్రాంతం21.834 చ.కి.మీ
సాధారణ ఎత్తు358.7 మీ.


గడ్డెన్న వాగు నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి 2 కి.మీ. దూరంలో సుద్దవాగుపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టు. సుద్దవాగు, గోదావరి నదిలో కలిసే ఉపనదం. నిర్మల్ జిల్లా లోని లోకేశ్వరం, భైంసా, ముధోల్ మండలాల్లోని 20 గ్రామాల్లో 14 వేల ఎకరాల్లో సాగునీరుతోపాటు భైంసా నగర పంచాయతీలో తాగునీరు అందించాలని ఈ ప్రాజెక్టు నిర్మించారు.[2][3]

20.33 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు 2000 సంవత్సరంలో మొదలై, 2006 లో పూర్తైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Irrigation Projects in Telangana". irrigation.telangana.gov.in. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  2. "Irrigation Projects in Telangana". irrigation.telangana.gov.in. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  3. గడ్డెన్న వాగు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
  4. "కడెం ప్రాజెక్టు వరద గేటు ఎత్తివేత". m.andhrajyothy.com. Archived from the original on 2020-06-09. Retrieved 2020-05-11.