గబ్బిట బాలసుందర శాస్త్రి
స్వరూపం
గబ్బిట బాలసుందర శాస్త్రి | |
---|---|
జననం | 1895 |
మరణం | జూలై 2, 1961 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, నటశిక్షకుడు |
గబ్బిట బాలసుందర శాస్త్రి (1895 - జూలై 2, 1961) ప్రముఖ రంగస్థల నటుడు, నటశిక్షకుడు. బందరు ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో ముఖ్య పాత్రధారి.[1]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]బాలసుందర శాస్త్రి 1895 లో గురునాథం, వేదాంతి సుబ్బమ్మ దంపతులకు బందరు లో జన్మించాడు. 1920లో గాంధీజీ పిలుపుమేరకు బి.ఏ. చదువుకు మధ్యలోనే అపేసి, నాటక కళా వ్యాసంగం, ఆధ్యాత్మిక చింతన వైపు తన దృష్టి సారించాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]చిన్నవయసునుండి కళలపై ఆసక్తి ఉన్న బాలసుందర శాస్త్రి నాటకరంగంలోకి అడుగుపెట్టి అనేక నాటకాలలో నటించాడు. ఒథెల్లో, విశ్వామిత్రుడు (సత్య హరిశ్చంద్ర) వంటి పాత్రలు చాలా చక్కగా అభినయించేవాడు. ఎంతోమందిని నటులుగా తీర్చిదిద్దాడు.
నటించిన పాత్రలు
[మార్చు]- ధర్మరాజు
- దుర్యోధనుడు
- కంసుడు
- ఆంజనేయుడు
- సుదర్శన చక్రవర్తి
- కలి
- సుదేవుడు
- రామరాజు
- ఔరంగజేబు
- యముడు
- అమరసింహుడు
- గిరీశం
- శతమిత్రుడు
- పెద్దన
- స్వామినాథం
- విశ్వామిత్రుడు
- ఒథెల్లో
మరణం
[మార్చు]నాటకరంగంలో ఒక వెలుగు వెలిగిన ఈయన చివరి దశలో దారిద్ర్యం అనుభవించి 1961, జూలై 2 న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.436.