గబ్బిట యగ్గన్న శాస్త్రి
గబ్బిట యగ్గన్న శాస్త్రి (1875-1921) రచయిత, పదకర్త, భక్త రచయిత, గాయకుడు. అతను రాసిన జావళీలు ఆంధ్ర దేశం లోనేకాక కర్ణాటక, మహారాష్ట్ర నాటకాలలో వీటి నకళ్ళు ప్రవేశించి మెప్పు పొందాయి.
జీవిత విశేషాలు
[మార్చు]పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర దెందులూరు మండలం లోని గబ్బిట వారి ‘’రామారావు గూడెం అగ్రహారం ‘’వాస్తవ్యుడు. గౌతమస గోత్రీకుడు తెలుగు బ్రాహ్మణుడు. ఆజన్మ బ్రహ్మ చారి. అతని తండ్రి సూర్యనారాయణశాస్త్రి. అతని గురువు కట్టు సూరన్న శాస్త్రి. అనితర సాధ్యమైన గాన ప్రతిభ అతని సొత్తు. ఒకరకంగా గానయజ్ఞం చేశాడు యగ్గ (జ్ఞ) న్న శాస్త్రి. పండితాదరం పొందిన గాయకుడు. ఫిడేల్ వాద్యకారుడు గొర్తి లక్ష్మీ నారాయణతో కలిసి ఎన్నో చోట్ల కచేరీలు చేసి సత్కారాల౦దుకున్నాడు. అతని శిష్యులు ఇరుగంటి బుచ్చిరామ శాస్త్రి, దంపూరి సుబ్బారావు, తిరువయ్యార్ కు చెందిన పల్లవి సుబ్బారావు, కాకినాడకు చెందిన సత్యరాజు బ్రహ్మేశ్వరరావు. నాట్యాభినయ శిష్యురాండ్రు చేటపర్రు సుందరి, పువ్వులపాపాచలం మొదలైనవారు. యగ్గన్న శాస్త్రి చాలా కృతులు, జావళీలు, వేంకటేశ, భద్రాద్రి రామ శతకాలు రచించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ gdurgaprasad (2020-01-08). "దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2". సరసభారతి ఉయ్యూరు. Retrieved 2020-04-06.