గల్లా రామచంద్ర నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గల్లా రామచంద్ర నాయుడు
జననం (1938-06-10) 1938 జూన్ 10 (వయసు 85)
పేటమిట్ట, చిత్తూరు జిల్లా
జీవిత భాగస్వామిగల్లా అరుణ కుమారి
పిల్లలుగల్లా జయదేవ్

గల్లా రామచంద్ర నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. అమరరాజా బ్యాటరీస్ సంస్థ వ్యవస్థాపకుడు.[1]ఈయన భార్య గల్లా అరుణ కుమారి మాజీ శాసనసభ సభ్యురాలు. కొడుకు గల్లా జయదేవ్ తెలుగుదేశం తరపున ఎం.పీ గా పనిచేస్తున్నాడు.

వ్యక్తిగతం[మార్చు]

గల్లా రామచంద్ర నాయుడు 1938, జూన్ 10 న చిత్తూరు జిల్లా, పేటమిట్ట లో జన్మించాడు. జె. ఎన్. టి. యు అనంతపురం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బి. ఇ పూర్తి చేశాడు. తర్వాత రూర్కీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి మాస్టర్స్ చేశాడు. తర్వాత అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయం నుంచి రెండోసారి మాస్టర్స్ పట్టా తీసుకున్నాడు.

కుటుంబం[మార్చు]

ఈయన భార్య గల్లా అరుణ కుమారి మాజీ శాసనసభ సభ్యురాలు. కొడుకు గల్లా జయదేవ్ తెలుగుదేశం తరపున ఎం.పీ గా పనిచేస్తున్నాడు.

పురస్కారాలు[మార్చు]

  • 1998 లో హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నుంచి బెస్ట్ ఆంత్రోప్రెనర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం.[2]
  • 2007 లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు
  • 2008 లో జె. ఎన్. టి. యు నుంచి గౌరవ డాక్టరేటు
  • అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి వారి నుంచి ది స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారం

సేవలు[మార్చు]

సామాజిక బాధ్యత గా ఈయన కొన్ని సేవాసంస్థలు ఏర్పాటు చేసి వివిధ రంగాల్లో సేవలందిస్తున్నాడు.[2]

  • కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసోసియేషన్: 1975 లో ప్రారంభించబడిన ఈ ట్రస్టు విద్యార్థుల ఉన్నత విద్యకోసం ఉపకార వేతనాలు అందిస్తోంది.
  • రాజన్న ట్రస్ట్: 1999 లో ప్రారంభించబడిన ఈ ట్రస్టు చెక్ డ్యాముల నిర్మాణం ద్వారా వృధా అవుతున్న వాననీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేస్తోంది.
  • మంగమ్మ & గంగుల నాయుడు ట్రస్ట్: 2003 లో ప్రారంభించబడిన ఈ సంస్థ పేటమిట్ట, దాని పరిసర గ్రామాలకు నీటి సమస్యలను పరిష్కరించడానికి పాటుపడుతోంది.

మూలాలు[మార్చు]

  1. "బ్లూం బర్గ్ లో రామచంద్ర నాయుడు ప్రొఫైలు". bloomberg.com. Retrieved 17 February 2018.
  2. 2.0 2.1 "అమర రాజా చైర్మన్ గురించి వారి వెబ్ సైటు లో". amararaja.co.in. Archived from the original on 5 నవంబరు 2017. Retrieved 19 February 2018.