గాంధీ స్మృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాంధీ స్మృతి, న్యూఢిల్లీ

గాంధీ స్మృతి దేశ రాజధాని కొత్త ఢిల్లీలో ఉన్న మ్యూజియం. మహాత్మా గాంధీ తన మరణం జనవరి 30, 1948 ముందు ఉన్న 144 రోజులు ఈ భవనంలోనే గడిపాడు. ఈ భవనాన్ని బిర్లా హౌస్, బిర్లా భవన్ అని కూడా పిలుస్తారు.[1]

చరిత్ర[మార్చు]

ఈ భవనాన్ని ఘనశ్యాం దాస్ బిర్లా 1928 లో 12 గదులతో నిర్మించాడు. ఈ భవనానికి తరచు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్శించేవారు. మహాత్మా గాంధీ తన చివరి రోజులు సెప్టెంబర్ 9, 1947 నుంచి జనవరి 30, 1948 వరకు ఈ భవనంలోనే గడిపాడు.

మరిన్ని విశేషాలు[మార్చు]

గాంధీ మరణాతరం అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రు ఈ భవనాన్ని గాంధీ గుర్తుగా ఒక స్మృతి భవనంగా మార్చడం కోసం ఘనశ్యాం దాస్ బిర్లా కి లేఖ రాసాడు. కానీ ఈ భవనం మీద ఉన్న జ్ఞాపకాల కోసం ఆ లేఖను ఆయన తిరస్కరించాడు. 1971 లో ఘనశ్యాం దాస్ బిర్లా రెండవ కుమారుడు కృష్ణ కుమార్ బిర్లా నుంచి భారత ప్రభుత్వం అనేక సంభాషణల తరువాత ఈ భవనాన్ని 5.4 మిల్లియన్లతో సహా ఏడు ఎకరాల భూమి ఇచ్చి భారత ప్రభుత్వం ఈ భవనాన్ని ఆధీనంలోకి తీసుకుంది.

మ్యూజియం[మార్చు]

ఈ మ్యూజియాన్ని ఆగస్టు 15, 1973 న గాంధీ గుర్తుగా ఈ భవనానికి గాంధీ స్మృతిగా నామకరణం చేసారు. ఈ మ్యూజియాన్ని సోమవారం మినహాయిస్తే అన్ని రోజులు సందర్శకులను అనుమతిస్తారు.[2]

మూలాలు[మార్చు]

  1. "The Eternal Gandhi". Sacred World. Archived from the original on 3 మార్చి 2019. Retrieved 3 August 2019. Check date values in: |archive-date= (help)
  2. "Gandhi Smriti and Darshan Samiti Delhi". KahaJaun. Retrieved 3 August 2019.