గాలి వినోద్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాలి వినోద్ కుమార్
గాలి వినోద్ కుమార్

ప్రొఫెసర్‌ గాలి వినోద్ కుమార్


వ్యక్తిగత వివరాలు

జననం 19 సెప్టెంబరు 1970
మామునూర్ గ్రామం
హనుమకొండ మండలం
వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
సంతానం 2
నివాసం తార్నాక, హైదరాబాద్
మతం హిందూ

గాలి వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్. ఆయన ప్రస్తుతం సౌత్ ఇండియా పొలిటికల్ ఐక్యా కార్యాచరణ సమితి ఛైర్మన్‌గా, సౌత్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ జేఏసీ ఛైర్మన్‌గా, నవ భారత్ నిర్మాణం చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్‌గా, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ హెచ్.ఓ.డిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]గాలి వినోద్‌ కుమార్‌ విద్యారంగంలో విశేష కృషి చేసినందుకు గాను 2021 జూన్లో ఆసియా పసిఫిక్‌ ఎక్స్‌లెన్స్‌ – లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు – 2021కు ఎంపికయ్యాడు.[3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

గాలి వినోద్ కుమార్ 1970 సెప్టెంబరు 19న తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మామునూర్ గ్రామంలో గాలి కట్టయ్య, ఐక్యమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన మామునూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 1986లో పదవ తరగతి పూర్తి చేశాడు. 1988లో హనుమకొండలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆయన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి 2008లో పి.హెచ్.డి పట్టా అందుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ 2015లో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వామపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతుతో పోటీ చేశారు.[4]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (22 June 2017). "Ex-Osmania University college principal to try luck in politics". The New Indian Express. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  2. Andhrajyothy (1 March 2021). "పట్టభద్రులు ప్రలోభాలకు గురికావద్దు : గాలి వినోద్‌". www.andhrajyothy.com. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  3. Namasthe Telangana (2 June 2021). "ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు". Namasthe Telangana. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
  4. Sakshi (30 September 2015). "వామపక్షాల అభ్యర్థిగా గాలి వినోద్". Sakshi. Archived from the original on 24 May 2021. Retrieved 24 May 2021.