గిరిజాప్రసాద్ కొయిరాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గిరిజాప్రసాద్ కొయిరాలా

గిరిజాప్రసాద్ కొయిరాలా (Girija Prasad Koirala) ఫిబ్రవరి 20, 1925న బీహార్ లోని తాడిలో జన్మించాడు. నేపాల్‌కు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు, నాలుగు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. యవ్వవ వయస్సులో అధికకాలం భారతదేశంలో గడిపాడు. 1991లో నేపాల్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కొయిరాలా కృషిచేశాడు. మార్చి 20, 2010న మరణించాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

1947లో కార్మికుల సమ్మె ద్వారా కొయిరాలా రాజకీయాలలో ప్రవేశించాడు.[2] 1948లో నేపాల్ మజ్దూర్ కాంగ్రెస్‌ను స్థాపించాడు. తరువాతి కాలంలో అది నేపాల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌గా మారింది. 1952లో కొయిరాలా మొరంగ్ జిల్లా నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడై 1960లో రాజు మహేంద్ర అరెస్టు చేసి జైలుకు పంపించేవరకు కొనసాగినాడు. 1967లో జైలు నుండి విడుదలై భారత్‌కు పంపివేయబడ్డాడు. 1979లో తిరిగి నేపాల్ చేరినాడు. అంతకు ముందే 1975 నుంచే నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిని పొంది 1991 వరకు ఆ పదవిలో కొనసాగినాడు. 1991 ఎన్నికలలో విజయం సాధించి నేపాల్ ప్రధానమంత్రిగా రాజు బీరేంద్రచే నియమించబడి. 1994 వరకు పదవిలో కొనసాగినాడు. 1998లో రెండవసారి ప్రధానమంత్రి పదవిని పొంది 1999 వరకు పదవిలో ఉండినాడు. 2000లో మూడవ పర్యాయం, 2006లో నాలుగవ పర్యాయం ప్రధానమంత్రి పదవిని పొందినాడు. 2007లో నేపాల్ అధ్యక్షుడిగా పనిచేసాడు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 21.03.2010
  2. Marasini, Prerana (20 March 2010). "G.P. Koirala passes away". The Hindu (The Hindu Group). http://www.hindu.com/2010/03/21/stories/2010032159310100.htm Archived 2010-03-24 at the Wayback Machine. Retrieved 21 March 2010.