గిరిజా ఓక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గిరిజా ఓక్
పోష్టర్ బాయ్జ్ ఈవెంట్‌లో గిరిజా ఓక్
జననం (1987-12-27) 1987 డిసెంబరు 27 (వయసు 36)[1]
విద్యాసంస్థఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సుహృద్ గాడ్బోలే
(m. 2011)
తల్లిదండ్రులు
  • గిరీష్ ఓక్ (మరాఠీ చలనచిత్ర నటుడు) (తండ్రి)

గిరిజా ఓక్ భారతీయ నటి. ఆమె మరాఠీ, హిందీ సినిమాలలో ఎక్కువగా నటిస్తుంది. తారే జమీన్ పర్ (2008), షోర్ ఇన్ సిటీ (2010), జవాన్ (2023) చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది.[2]

కెరీర్

[మార్చు]

గిరిజ 15 సంవత్సరాల వయస్సులో వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆమె గోష్ట చోటి డోంగ్రేవధి, గుల్మోహర్, మణిని, అద్గులే మద్గులేతో సహా పలు మరాఠీ సినిమాలలో నటించింది.[3][4]

పీయూష్ రనడే, తేజస్విని పండిట్, ముక్తా బర్వే తదితరులు నటించి, జీ మరాఠీ ప్రసారం చేసిన లజ్జా ధారావాహికలో ఆమె ప్రధాన పాత్రతో బుల్లితెరపై అరంగేట్రం చేసింది. ఇంవులో ఆమె కుంభకోణం బాధితురాలు మనస్విని దేశాయ్ (మను) పాత్ర పోషించింది. ఆమె పలు మరాఠీ నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించింది.

2018లో నవజ్యోత్ బండివాడేకర్ దర్శకత్వం వహించిన క్వార్టర్ అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ గిరిజా ఓక్ నటించింది.[5] ఈ చిత్రం 71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కోర్ట్ మెట్రేజ్ (షార్ట్ ఫిల్మ్ కార్నర్) కేటగిరీలో ప్రదర్శించబడింది. అంతేకాకుండా, ఆ చిత్రం తరువాత వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది. ఈ చిత్రంలో ఆమె నటనకు, యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ 2018లో ఉత్తమ నటిగా తన మొదటి అంతర్జాతీయ అవార్డును గెలుచుకుంది. అలాగే, ఆమె మావెరిక్ మూవీ అవార్డ్స్ 2018లో ఉత్తమ అంతర్జాతీయ నటిగా నామినేట్ చేయబడింది.[6] పోస్టర్, ట్రైలర్‌ను విడుదల చేసిన మొదటి భారతీయ షార్ట్ ఫిల్మ్ గా క్వార్టర్ నిలిచింది.[7] భారతీయ పత్రికా సభ్యులు, భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు హాజరైన బహిరంగ కార్యక్రమం.[8] ఈ చిత్రం డిజిటల్‌గా 2020 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో లేడీస్ స్పెషల్ అనే హిందీ సీరియల్ రెండవ సీజన్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ప్రముఖ సింగింగ్ కాంటెస్ట్ సింగింగ్ స్టార్‌లో ఆమె ఫైనలిస్ట్.[9]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గిరిజా ఓక్ మరాఠీ నటుడు గిరీష్ ఓక్ కుమార్తె. ఆమె ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ కండివాలి ఈస్ట్‌లో బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.[10] ఆమె ఒక థియేటర్ వర్క్‌షాప్‌లో చేరింది. ఇక అప్పటి నుంచి ఆమె వాణిజ్య ప్రకటనలలో నటించడం ప్రారంభించింది.[11]

ఆమె సుహ్రుద్ గాడ్బోలేను వివాహం చేసుకుంది.[12] ఆమె మరాఠీ సినిమా నటుడు, డైలాగ్ రైటర్, నిర్మాత శ్రీరంగ్ గాడ్‌బోలే కోడలు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2004 మణిని షాలిమి మరాఠీ
2007 తారే జమీన్ పర్ జబీన్ హిందీ
2008 మన్ పఖారు పఖారు మరాఠీ
2009 గోష్టా చోటీ డోంగ్రేవధీ వైదేహి మరాఠీ
గుల్మోహర్ మరాఠీ
చింగి మరాఠీ
హౌస్ ఫుల్ నీతూ కన్నడ
2010 లజ్జ మనస్విని దేశాయ్ (మను) మరాఠీ టెలివిజన్ ధారావాహిక
మణిని శాలిని మరాఠీ
హుప్పా హుయ్య వాసంతి మరాఠీ
2011 అద్గుల మాడ్గుల అనూజ మరాఠీ
షోర్ ఇన్ ది సిటీ సెజల్ హిందీ
సైకిల్ కిక్ సృష్టి హిందీ
2013 నవరా మజా భావ్రా మరాఠీ
2014 ది జర్నీ టు హర్ స్మైల్ రేవతి దేశ్‌ముఖ్ ఆంగ్ల
2015 బాజీ మరాఠీ అతిధి పాత్ర
2015 2 ప్రేమి ప్రేమచే మరాఠీ
2017 బాకీ ఇతిహాస్ కనక్ చక్రవర్తి హిందీ
2018 మూవింగ్ అవుట్ మరాఠీ వెబ్ సీరీస్
2018–2019 లేడీస్ స్పెషల్ మేఘనా నికడే హిందీ టెలివిజన్ ధారావాహిక
మౌళి మౌళి తల్లి మరాఠీ
2019 పాండు శ్రీమతి సిన్హా మరాఠీ టెలివిజన్ ధారావాహిక
2020 క్వార్టర్ అశ్విని రనడే మరాఠీ షార్ట్ ఫిల్మ్[13]
గోష్ట ఏక పైథానిచి శీల మరాఠీ
2021 కార్టెల్ రామ హిందీ వెబ్ సీరీస్
2022 నైన్ టు ఫైవ్ ఆషిక మరాఠీ వెబ్ సీరీస్ వైటి
మాడరన్ లవ్: ముంబై కృతి టెలివిజన్ ధారావాహిక
ఖలా సుధ నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్
2023 జవాన్ ఇష్క్రా [14]
ది వ్యాక్సిన్ వార్ డా. నివేదిత గుప్తా [15]

మూలాలు

[మార్చు]
  1. "Sai Tamhankar Wishes Her Bestie Girija Oak Godbole On Her Birthday With An Adorable Post". Retrieved 13 May 2022.
  2. Das, Soumitra (26 April 2012). "B-Town uses skin show to titillate: Girija Oak". The Times of India. Retrieved 21 November 2019.
  3. Girija Oak- The Times of India Photogallery
  4. Girija Oak during the launch of matrimonial website 'Saathiya'
  5. "Girija Oak makes a short film debut - Times of India". The Times of India.
  6. "WINNERS – May 2018 | European Cinematography AWARDS".
  7. "2018 Maverick Movie Awards & Nominations!". Archived from the original on 2021-10-20.
  8. "Quarter: Teaser launch Photogallery - ETimes".
  9. "Singing Star: Aastad Kale, Girija Oak and three others make it to finale".
  10. In my father's footsteps - Entertainment - DNA
  11. In my father’s footsteps
  12. https://www.loksatta.com/photos/entertainment-gallery/3122545/marathi-actress-girija-oak-godbole-shared-pics-with-green-dress-on-instagram-spg-93/lite/
  13. "Girija Oak makes a short film debut - Times of India". The Times of India.
  14. "'Jawan': Girija Oak Godbole bags a key role in Shah Rukh Khan's upcoming film". The Times of India. 2023-05-08. ISSN 0971-8257.
  15. "The Vaccine War: Review and Story". Kissu (in ఇంగ్లీష్). Retrieved 2023-09-30.