Jump to content

గిరీష్ చంద్ర

వికీపీడియా నుండి
గిరీష్ చంద్ర

పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు యశ్వంత్ సింగ్
తరువాత చంద్రశేఖర్ ఆజాద్ రావణ్
నియోజకవర్గం నగీనా

వ్యక్తిగత వివరాలు

జననం (1964-01-15) 1964 జనవరి 15 (వయసు 60)
ఖుషల్పూర్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ
తల్లిదండ్రులు మాన్ సింగ్, దహదో దేవి
జీవిత భాగస్వామి వీరమావతి
సంతానం 1
మూలం [1]

గిరీష్ చంద్ర (జననం 15 జనవరి 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నగీనా నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

గిరీష్ చంద్ర 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నగీనా నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యశ్వంత్ సింగ్‌ను 1,66,832 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన పార్లమెంట్‌లో  కమిటీ ఆన్ పేపర్స్ టేబుల్‌పై చైర్‌పర్సన్‌గా, షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడిగా, పెట్రోలియం & సహజ వాయువుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లుపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, మాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, లో‍క్‍సభలో బీఎస్‌పీ ఫ్లోర్ లీడర్‌గా,[2] విప్‌‌గా పని చేశాడు.[3]

గిరీష్ చంద్ర 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బులంద్‌షహర్ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. The Indian Express (2 June 2019). "After 15 years, BSP picks a Dalit as its floor leader in Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
  3. The Indian Express (23 June 2019). "Mayawati's brother, nephew get plum posts in BSP, Danish Ali named Lok Sabha leader" (in ఇంగ్లీష్). Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
  4. "2024 Loksabha Elections Results - Bulandshahr". 4 June 2024. Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.