గీతా సానే
గీతా జనార్దన్ సానే (गीता जनार्दन साने) (1907 సెప్టెంబరు 3 – 1991 సెప్టెంబరు 12) భారతదేశంలోని మహారాష్ట్ర చెందిన స్త్రీవాద రచయిత్రి.[1][2] మహారాష్ట్ర మొట్టమొదటి స్త్రీవాద మేధావుల్లో ఆమె ఒకరు.[3]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]గీతా అమరావతిలో జన్మించింది. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు, తరువాత న్యాయవాదిగా శిక్షణ పొందాడు. ఆమె తల్లిదండ్రులు తమ ఆలోచనలో ప్రగతిశీలులు. వారు తమ కుమార్తెలకు ఎటువంటి మతపరమైన ఆచారాలు లేకుండా వివాహాలు నిర్వహించారు. ఈ వివాహాలకు "ఒక్కొక్కదానికి ఒకటిన్నర రూపాయలు ఖర్చయి ఉండాలని" అని ఆమె ఒకసారి చెప్పింది.[4] గీతా నాగపూర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులలో, విజ్ఞానశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందిన మొట్టమొదటి మహిళా విద్యార్థిని, తర్వాత గణితం బోధించింది.[2] ఆమె కంటే ముందు, ఆ విశ్వవిద్యాలయంలోని మహిళలు, భారతదేశంలోని ఇతర విశ్వవిద్యాలయాల మాదిరిగానే, లిబెరల్ ఆర్ట్స్ అభ్యసించారు.
ప్రగతిశీల ఆలోచనలు
[మార్చు]గీతా కళాశాల రోజుల్లో మార్క్సిజం ద్వారా ప్రభావితమైంది.గీతా 1927లో వ్యాసాలు రాయడం ప్రారంభించింది. ఆమె మొదటి వ్యాసం పూణె వైభవ్‌లో ప్రచురించబడిన ఖాన్-పనందికర్ వ్యవహార వార్తాకథనానికి ప్రగతిశీల ప్రతిస్పందన. సంప్రదాయవాద కోలాహలం ఒక ముస్లిం, హిందూ విశ్వవిద్యాలయ విద్యార్థిలు మధ్య మతాంతర వివాహం గురించి.[4] గీతా స్త్రీవాదిగా మాతృస్వామ్య వ్యవస్థను సమర్ధించింది. 26 సంవత్సరాల వయస్సులో న్యాయవాది నరసింహ ధగమ్వర్ ని వివాహం చేసుకున్న తరువాత ఆమె తన చివరి పేరును సానేగా కొనసాగించింది, ఇతర మహిళలకు మాతృస్వామ్య ఇంటిపేరు నిలుపుదల ఆలోచనను ముందుకు తెచ్చింది. వివాహిత మహారాష్ట్ర మహిళలు తమ వైవాహిక స్థితికి చిహ్నంగా నుదిటిపై సింధూరం వాడటం, పుస్తెలు ధరించడం మానేయాలని సూచించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]పెళ్లికి ముందు గీతా భర్త 1929లో మీరట్ కుట్రలో పాల్గొన్నాడని బ్రిటిష్ ప్రభుత్వం అభియోగాలు మోపింది.[5] గీతా కుమార్తె వసుధా ధగమ్వర్ న్యాయవాది, పాత్రికేయురాలు, పౌర హక్కుల కార్యకర్త.[4]
పురస్కారాలు
[మార్చు]ఆమె రాసిన చంబలచి దస్యుభుమి (चंबळची दस्युभूमी), భరతియ స్ర్రీజీవన్ (भारतीय स्त्रीजीवन) పుస్తకాలకు మహారాష్ట్ర రజ్య పరితొషిక్ (महाराष्ट्र राज्य पारितोषिक), సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి. 1990లో మహారాష్ట్ర రజ్య గౌరవ్ పురస్కరం (महाराष्ट्र राज्य गौरव पुरस्कार) అందుకున్నారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "परिवर्तनवादी विचारवंत". Loksatta (in మరాఠీ). 2018-09-29. Retrieved 2024-02-04.
- ↑ 2.0 2.1 "साने, गीता जनार्दन". महाराष्ट्र नायक (in మరాఠీ). Retrieved 2024-02-04.
- ↑ "In memoriam – Remembering Vasudha". www.india-seminar.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-04.
- ↑ 4.0 4.1 4.2 Women writing in India. 1: 600 B.C. to the early twentieth century (in ఇంగ్లీష్) (Repr. ed.). New York, NY: Feminist Press. 2002. p. 446. ISBN 978-1-55861-027-9.
- ↑ "ADVOCATE VASUDHA DHAGAMWAR - One India One People Foundation" (in ఇంగ్లీష్). 2014-04-01. Retrieved 2024-02-04.