వసుధా ధగమ్వర్
డా. వసుధా వసంతి ధగమ్వర్ (डॉ. वसुधा वासंती धगमवार) (1940 ఫిబ్రవరి 29 [1][2] – 2014 ఫిబ్రవరి 12) న్యాయవాది, పండితురాలు, పరిశోధకురాలు, రచయితిృ, కార్యకర్త.[3] ఆమె మల్టిపుల్ యాక్షన్ రీసెర్చ్ గ్రూప్ (Multiple Action Research Group) (MARG) వ్యవస్థాపక డైరెక్టర్.
జననం, విద్యాభ్యాసం
[మార్చు]ఆమె తల్లి గీతా సానే రచయిత్రి, స్త్రీవాది. ఆమె తండ్రి నరసింహ ధగమ్వర్ న్యాయవాది, భారత స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు పాట్నాలో ఎంఏ (ఆంగ్లం) చదివిన తరువాత కొంతకాలం మిరాండా హౌస్ లో ఆంగ్లం బోధించారు.[1] ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రం, రాజకీయాలలో డిగ్రీ, ఇండియన్ లా సొసైటీ లా కాలేజీలో (ILS Law College) న్యాయశాస్త్రం (బ్యాచిలర్ ఆఫ్ లా) చదివింది, తరువాత ఆమె పూణే విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో బోధించింది.[4] SOAS యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి న్యాయ చరిత్రలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చదివింది.[1]
కెరీర్
[మార్చు]1979 సెప్టెంబరు 16న మథురా అత్యాచార కేసుకు సంబంధించి భారతదేశ అత్యున్నత న్యాయస్థానంకు మథురా ఓపెన్ లెటర్పై (Mathura Open Letter) సంతకం చేసిన నలుగురిలో ఆమె ఒకరు.[5][6] ఇది భారతదేశంలో లైంగిక హింసకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమాన్ని ప్రేరేపించడానికి సహాయపడింది.[7] 1980లో ఆమె గిరిజన హక్కులు, చట్టం సమస్యపై మహారాష్ట్రలోని అక్రానీ, అకల్కువాలోని అంతర్గత గిరిజన ప్రాంతంలో పర్యటించి పనిచేశారు. 1982లో అశోక ఫెలోగా ఎన్నికయ్యారు.[3] 1985లో ఆమె ఢిల్లీలో మల్టిపుల్ యాక్షన్ రీసెర్చ్ గ్రూప్ (మార్గ్) ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు, ఇందులో చట్టపరమైన అవగాహన, న్యాయవాద, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ప్రోత్సహించడంపై దృష్టితో వ్యవహించారు.[8] మార్గ్ లో పనిచేస్తున్న సమయంలో, ఆమె సామాజిక కార్యకర్త సుబ్రతా దే, న్యాయవాది నిఖిల్ వర్మలతో "పారిశ్రామిక అభివృద్ధి, స్థానభ్రంశం: కొర్బా ప్రజలు" (Industrial Development and Displacement: The People of Korba) పుస్తకం రచించారు. ఆమె 2005 లో మార్గ్ నుండి పదవీ విరమణ చేశింది.[8][9]జాతీయ మహిళ కమిషన్ యొక్క న్యాయ నిపుణుల కమిటీలో సభ్యురాలిగా, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ (Commonwealth Human Rights Initiative) యొక్క కార్యనిర్వాహక సంస్థలో సభ్యురాలిగాను కూడా పనిచేశారు.[4][8][10][11]
చట్టాన్ని ఉపయోగించడం ద్వారా ఆమె రెండు తరాల స్త్రీవాదులను, ఉద్యమకారులను ప్రభావితం చేసింది.[4][10][12]
మరణానికి ముందు ఆమె తన తల్లి ఆత్మకథను మరాఠీ నుండి ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు.[1][4][10][12] జీవితంలో అవివాహితురాలిగా ఉండడం ఆమె ఎంపిక చేసుకుంది.[12] ఆమె 2014 ఫిబ్రవరి 12 న పూణేలో మరణించారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 Ramachandra, Guha. "In memoriam – Vasudha Dhagamwar (1940-2014)". www.india-seminar.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-04.
- ↑ "80th Birthday of Dr. Vasudha Vasanti Dhagamwar 29th Feb. 2020". Multiple Action Research Group (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-01. Retrieved 2024-02-06.
- ↑ 3.0 3.1 "Dr. Vasudha Dhagamwar – Oral History Narmada" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-02-06.
- ↑ 4.0 4.1 4.2 4.3 "ADVOCATE VASUDHA DHAGAMWAR - One India One People Foundation" (in ఇంగ్లీష్). 2014-04-01. Retrieved 2024-02-04.
- ↑ (1979) 4 SCC (Jour) 17 An Open Letter to the Chief Justice of India
- ↑ Muralidhar, S. "The Legacy of the Life and Work of Lotika Sarkar". Indian Journal of Gender Studies (in ఇంగ్లీష్). 29 (2): 168–198. doi:10.1177/09746862221082174. ISSN 0971-5215.
- ↑ Dutta, Debolina; Sircar, Oishik (2013). "India's Winter of Discontent: Some Feminist Dilemmas in the Wake of a Rape". Feminist Studies (in ఇంగ్లీష్). 39 (1): 293–306. doi:10.1353/fem.2013.0023. ISSN 2153-3873.
- ↑ 8.0 8.1 8.2 "Activist Vasudha Dhagamwar dies". punemirror.com (in ఇంగ్లీష్). 2014-02-11. Retrieved 2024-02-06.
- ↑ Upendra, Baxi. "In memoriam – Remembering Vasudha". www.india-seminar.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-04.
- ↑ 10.0 10.1 10.2 "India: Advocate Vasudha Dhagamwar (1940-2014), legal activist and academician - Europe Solidaire Sans Frontières". europe-solidaire.org. Retrieved 2024-02-08.
- ↑ "Obituary: Vasudha Dhagamwar (1940 – 2014)" (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-02-17. Retrieved 2024-02-06.
- ↑ 12.0 12.1 12.2 "Obituary: Vasudha Dhagamwar (1940 – 2014)" (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-02-17. Retrieved 2024-02-06.
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- CS1 బ్రిటిష్ ఇంగ్లీష్-language sources (en-gb)
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description matches Wikidata
- Articles containing Marathi-language text
- Articles containing English-language text
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- మహిళలు
- 20వ శతాబ్దపు భారతీయ రచయిత్రులు
- 2014 మరణాలు
- 1940 జననాలు