గుజ్జుల నర్సయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుజ్జుల నర్సయ్య
జననం1942
మండెల గూడెం, రఘునాథపల్లి మండలం, జనగామ జిల్లా
మరణం2022 సెప్టెంబరు 24
వృత్తివిద్యావేత్త, ఏబీవీపీ ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్య‌క్షుడు, అధ్యాపకుడు
జీవిత భాగస్వామిరాజ్యలక్ష్మి
పిల్లలుముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు

గుజ్జుల నర్సయ్య (జననం 1942 - 2022 సెప్టెంబరు 24) భారతీయ విద్యావేత్త, ఆయన విశ్రాంత ఆచార్యులు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు.

కెరీర్[మార్చు]

శాంతమ్మ, రాజమల్లయ్య దంపతులకు ఆరుగురు సంతానంలో గుజ్జుల నర్సయ్య మూడవ వాడిగా 1942లో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం ఆయన స్వస్థలమైన మండెల గూడెం, ఖిలాశాపూర్ గ్రామాలలో సాగింది. ఆలేరులో ఇంటర్ చదివి హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ, ఆ తరువాత ఎం.ఎ (ఇంగ్లీష్)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. జూనియర్ కళాశాల ఆంగ్ల అధ్యాపకుడిగా 1981లో ఉద్యోగం ప్రారంభించిన ఆయన తదుపరి రోజుల్లో డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా పదోన్నతి పొందాడు. తెలంగాణలోని అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేసిన ఆయన 2001లో హనుమకొండ కాకతీయ డిగ్రీ కళాశాల నుంచి పదవీ విరమణ పొందాడు. కొంతకాలం బిహార్‌ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి సభ్యుడిగానూ పనిచేసాడు.[1]

బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావజాలాని ఆకర్శితుడైన ఆయన 1952 నుంచి హిందూత్వపై అనేక సభల్లో అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చాడు. 1967లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ కార్యకర్తగా చేరి 1986 నాటికి రాష్ట్ర అధ్యక్షుడుగా ఎదిగాడు. ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా కూడా కొనసాగాడు. 2007లో నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మరణం[మార్చు]

80 ఏళ్ళ గుజ్జుల నర్సయ్య 2022 సెప్టెంబరు 24న హనుమకొండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు.[2] ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "విద్యావేత్త గుజ్జుల నర్సయ్య మృతి". web.archive.org. 2022-09-25. Archived from the original on 2022-09-25. Retrieved 2022-09-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "ప్రముఖ హిందూత్వవాది గుజ్జుల నర్సయ్య ఇకలేరు - Andhrajyothy". web.archive.org. 2022-09-25. Archived from the original on 2022-09-25. Retrieved 2022-09-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)