అక్షాంశ రేఖాంశాలు: 13°37′42″N 74°41′20″E / 13.62833°N 74.68889°E / 13.62833; 74.68889

గుడ్డట్టు వినాయక దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుడ్డట్టు వినాయక దేవాలయం
జలధివాస గణపతి (వినాయక) దేవాలయం[1]
గుడ్డట్టు వినాయక దేవాలయం is located in Karnataka
గుడ్డట్టు వినాయక దేవాలయం
కర్ణాటకలో దేవాలయ ప్రాంతం
భౌగోళికం
భౌగోళికాంశాలు13°37′42″N 74°41′20″E / 13.62833°N 74.68889°E / 13.62833; 74.68889
దేశంభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాఉడిపి జిల్లా
స్థలంకుందాపుర
సంస్కృతి
దైవంవినాయకుడు
ముఖ్యమైన పర్వాలువినాయక చవితి
వాస్తుశైలి
దేవాలయాల సంఖ్య1
చరిత్ర, నిర్వహణ
స్థాపితం13వ శతాబ్ధం[2]

గుడ్డట్టు వినాయక దేవాలయం, కర్నాటక రాష్ట్రం, ఉడిపి జిల్లాలోని కుందాపుర పట్టణంలో ఉన్న ఉన్న వినాయక దేవాలయం.[3][4] భారతదేశంలోని ఏకైక జలధివాస గణపతి దేవాలయమిది. మూడు అడుగుల వినాయకుడి విగ్రహం రాతి నుండి ఉద్భవించిందని నమ్ముతారు. దేవాలయంలో ప్రతిరోజూ ఆయిర కోడ సేవ, తైలభ్యంజన, పంచామృత, రుద్రాభిషేకాలు నిర్వహించబడుతాయి. ఈ దేవాలయం గుడ్డట్టు అడిగ కుటుంబ వంశానికి చెందినది.[5]

చరిత్ర

[మార్చు]

ఇక్కడి స్వామిని 'సర్వ సిద్ధి ప్రదాయక' అని పిలుస్తారు. మంగళూరు నుండి దాదాపు 100 కి.మీ దూరంలో ఉన్న ఆనెగుడ్డె అనే పట్టణానికి 'అనే' (ఏనుగు), 'గుడ్డె' (కొండ) అని అర్ధం. పురాణాల ప్రకారం, ఈ ప్రాంతం కరువు, వర్షాభావ పరిస్థితులలో ఉన్నప్పుడు, వరుణదేవుడిని శాంతింపజేయడానికి అగస్త్య మహర్షి యాగం చేసాడు. ఈ సమయంలో, కుంభాసురుడు అనే రాక్షసుడు ఋషులను వారి ప్రార్థనలకు భంగం కలిగించాడు. ఆ రాక్షసుడిని ఓడించడానికి, పాండవుల భీమసేనుడు వినాయకుడిని ప్రార్థించి, అతనిని చంపడానికి ఆయుధాన్ని పొందాడు. ఈ ప్రదేశానికి కుంభాషి అనే పేరు, కుంభాసుర అనే రాక్షసుడి పేరు నుండి వచ్చింది.[6]

దేవాలయ వివరాలు

[మార్చు]

ఆకర్షణీయమైన ముఖమంటపం, తీర్థమంటపాలతో వాస్తు ప్రకారం గ్రానైటిక్ తో ఈ దేవాలయం పునర్నిర్మించబడింది. ఇక్కడి వినాయకుడి గణపతి విగ్రహం సుమారు 3 అడుగులు ఎత్తు ఉంటుంది. విగ్రహం చుట్టూ నల్లరాతి శిల్పం ఉంది. వినాయుడి మెడ వరకు ఎప్పుడూ నీరు ఉంటుంది. ఎదురుగా ఉన్న రంధ్రం ద్వారా వినాయకుడిని ప్రజలకు దర్శించుకోవచ్చు.

పూజలు, ఉత్సవాలు

[మార్చు]

ఇక్కడ ‘అయర్ కోడ సేవ’, తైలాభ్యంజన, పంచరథ, రుద్రాభిషేకం మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాధారణంగా 'రుద్రాభిషేక' సేవ శివాలయంలో నిర్వహిస్తారు కానీ ఇక్కడ వినాయకుడికి చేస్తారు. ఇక్కడి స్వామికి ఉడికించిన బియ్యం కుడుములు ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబరు నెలలో వార్షిక రథోత్సవం జరుగుతుంది. దానితోపాటు వినాయక చవితి, వినాయక జయంతి, సంకటహర చతుర్థి వంటి ముఖ్య పండుగలు కూడా నిర్వహించబడుతాయి.

మూలాలు

[మార్చు]
  1. "Guddattu Jaladhivasa Maha Ganapathi Temple". www.karnatakaholidays.com (in ఇంగ్లీష్). Karnataka. Archived from the original on 2020-02-04. Retrieved 2022-09-14.
  2. "Sri Vinayaka Temple, Guddattu, Kundapura, Udupi, Karnataka, India". www.guddattuvinayaka.in (in ఇంగ్లీష్). Udupi: Sri Vinayaka Temple, Guddattu. Retrieved 2022-09-14.
  3. Rao, Rashmi Gopal (2018-09-09). "Sacred structures in and around Barkur". Deccan Herald (in ఇంగ్లీష్). India: Deccan Herald. Archived from the original on 2019-04-15. Retrieved 2022-09-14.
  4. "Guddattu Vinayaka Temple". Times of India Travel (in ఇంగ్లీష్). India: Times Internet, The Times Group. Archived from the original on 2019-04-15. Retrieved 2022-09-14.
  5. "Sri Vinayaka Temple, Guddattu, Kundapura, Udupi, Karnataka, India - About". www.guddattuvinayaka.in (in ఇంగ్లీష్). Udupi: Sri Vinayaka Temple, Guddattu. Retrieved 2022-09-14.
  6. "Anegudde Vinayaka Temple". Times of India Travel. 2016-08-18. Archived from the original on 2018-07-27. Retrieved 2022-09-15.

బయటి లింకులు

[మార్చు]