గులాబ్ సింగ్ లోధి
గులాబ్ సింగ్ లోధి | |
---|---|
జననం | 1903 ఫతేపూర్ చౌరసి (చండికా ఖేరా), ఉన్నావ్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ |
మరణం | 23 ఆగస్టు 1935 (వయసు 32) అమీనాబాద్, లక్నో |
తండ్రి | ఠాకూర్ రామ్ రతన్ సింగ్ లోధి |
మతం | హిందువు |
Occupation | స్వాతంత్ర్య సమరయోధుడు |
గులాబ్ సింగ్ లోధి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు.
జననం
[మార్చు]లోధి 1903లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, ఉన్నావ్ జిల్లా, ఫతేపూర్ చౌరసి (చండికా ఖేరా) అనే గ్రామంలోని రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఠాకూర్ రామ్ రతన్ సింగ్ లోధి రైతు.
ఉద్యమం
[మార్చు]స్వాతంత్ర్యోద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన అనేక రాజకీయ కార్యకలాపాలలో లోధి చురుకుగా పాల్గొన్నాడు.
మరణం
[మార్చు]లోధి లక్నోలోని అమీనాబాద్‌లోని జాందేవాలా పార్కులో 1935, ఆగస్టు 23న మరణించాడు.[1] ఆ రోజు లక్నోలో జరిగిన స్వాతంత్ర్యోద్యమ ఊరేగింపులో లోధి పాల్గొన్నాడు. ఆ ఊరేగింపు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు అమీనాబాద్ పార్కుకు చేరుకుంది. అప్పటికే ఆ పార్కు చుట్టూ బ్రిటిష్ సైన్యం నిలుచుంది. గులాబ్ సింగ్ లోధి బ్రిటీష్ సైన్యాన్ని ధిక్కరించి ముందుకు కదిలాడు. పార్కులో ఉన్న చెట్టు ఎక్కి, జెండాను ఎగురవేస్తుండగా, బ్రిటిష్ అధికారి కాల్చి చంపాడు.[2]
గుర్తింపు
[మార్చు]2013, డిసెంబరు 23న భారత ప్రభుత్వం 'గులాబ్ సింగ్ లోధి' గౌరవార్థం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.[3] పార్కులో 2004లో లోధి విగ్రహం స్థాపించబడింది, కానీ 2009 నాటికి శిథిలావస్థకు చేరుకుంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Tripathi, Ashish (5 October 2009). "From triumph tales to unsung history". The Times of India. Retrieved 15 April 2014.
- ↑ |title=Gulab Singh Lodhi |date=13 january 2015
- ↑ website |url=http://www.istampgallery.com/gulab-singh-lodhi/%7Ctitle=[permanent dead link] Gulab Singh Lodhi |date=13 january 2015