గెంద ఫూల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"గెంద ఫూల్"
రూపాంతరం చెందిన జానపద గీతం by బాద్షా , పాయల్ దేవ్
ఆంగ్ల శీర్షిక"Marigold flower"
విడుదల2020 మార్చి 26 (2020-03-26)
శైలిఇండియన్ పాప్
నిడివి2:50
లేబుల్సోనీ మ్యూజిక్ ఇండియా
గీత రచయితబాద్షా, రతన్ కహర్

గెంద ఫూల్ అనేది, 2020 లో విడుదలై యూట్యూబ్ లో అత్యధిక భారతీయ ప్రేక్షకులు వీక్షించిన భారతదేశ పాప్ గీతం[1]. 2020 డిసెంబరు చివరి నాటికి ఈ గీత వీడియోని దాదాపు 60 కోట్ల మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వీక్షించారు[2]

చరిత్ర[మార్చు]

దస్త్రం:Badshah-imdb.jpg
గెంద ఫూల్ పాటను రాసి, స్వరపరిచిన బాద్షా చిత్రం

ఈ పాటను బాద్షా రాసి, స్వరపరిచారు, అయితే మొదటి సారిగా ఈ పాట మూలమైన బెంగాలీ పాట సాహిత్యాన్ని రతన్ కహార్ రాసి తనే స్వయంగా పాడటం జరిగింది. ఈ పాటకు మరిన్ని రాప్ హంగులు అద్ది దీనిని బాద్షా పాడాడు. ఈ పాట హిందూ పండుగ దుర్గా పూజ నేపథ్యంలో చిత్రీకరించబడింది.[3] సోషల్ మీడియాలో ఈ పాటను బాద్షా సన్నిహితుడు కరణ్ జోహార్ తన చేతుల మీదుగా విడుదల చేశాడు.[4]

పాట చిత్రీకరణ[మార్చు]

ఈ పాట చిత్రీకరణలో గాయకుడు బాద్షా, శ్రీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించారు.[5] దీనికి స్నేహ శెట్టి కోహ్లి దర్శకత్వం వహించారు.[6] ముంబైలోని ఎస్సెల్ స్టుడియోలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ పాటను చిత్రించడానికి మొత్తం రెండు రోజుల సమయం పట్టింది[5]. 2020 మార్చి 26న ఈ పాట యూట్యూబ్ లో విడుదలైనది[3].

మూలాలు[మార్చు]

  1. "Badshah & Payal Dev's "Genda Phool" Remains #1 On Global YouTube Music Videos Chart". Headline Planet (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-11. Retrieved 2020-05-04.
  2. "Trending Tunes: Genda Phool rules, Neha Kakkar's Jinke Liye enters the list". Bollywood Life (in ఇంగ్లీష్). 2020-05-03. Retrieved 2020-05-05.
  3. 3.0 3.1 Chakrabarti, Senjuti. "'Genda Phool': What Punjabi rapper Badshah got wrong when he borrowed a Bengali folk song". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-04-02. Retrieved 2020-04-02.
  4. "Karan Johar Launches The Badshah's Genda Phool". Outlook India. Retrieved 2020-04-13.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. 5.0 5.1 "PHOTOS: Jacqueline Fernandez and Badshah come together for a music video titled 'Genda Phool'". Bollywood Hungama (in ఇంగ్లీష్). 2020-03-25. Archived from the original on 2020-04-01. Retrieved 2020-04-02.
  6. "Genda Phool: Jacqueline Fernandez romances Badshah in this Bengali-Punjabi mix. Watch". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-03-26. Archived from the original on 2020-03-27. Retrieved 2020-04-04.

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గెంద_ఫూల్&oldid=3831353" నుండి వెలికితీశారు