జాక్వెలిన్ ఫెర్నాండేజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాక్వెలిన్ ఫెర్నాండేజ్
Jacqueline Fernandez
Jacqueline FBA 2017.jpg
2017 లో ఫెమినా బ్యూటీ అవార్డులలో ఫెర్నాండెజ్
జననం (1985-08-11) 1985 ఆగస్టు 11 (వయస్సు: 35  సంవత్సరాలు)
మనమా, బహ్రయిన్
జాతీయతశ్రీలంక
విద్యాసంస్థలుసిడ్నీ విశ్వవిద్యాలయం
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2009–ప్రస్తుతం

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (జననం 11 ఆగస్టు 1985) ప్రముఖ సినీ నటి, మోడల్. ప్రముఖంగా శ్రీలంకకు చెందిన ఈమె, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో ఆమె మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది.[1] సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది జాక్వెలిన్. శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది ఆమె. 

2009లో భారతదేశంలో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేసింది ఆమె. ఈ ప్రాజెక్టు ద్వారానే ఆమె నటిగా కెరీర్ ప్రారంభించింది. 2011లో ఆమె నటించిన మర్డర్2 ద్వారా ఆమె మొట్టమొదటి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో వరసగా ఆమెకు గ్లామర్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి. ఆ తరువాత ఆమె నటించిన హౌస్ ఫుల్ 2(2012), రేస్ 2(2013) సినిమాలు 1 బిలియన్ వసూళ్ళు దాటాయి.[2] హౌస్ ఫుల్ 2 సినిమాలోని నటనకుగానూ ఆమెకు ఐఫా పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ లభించింది. ప్రధాన కథానాయిక పాత్రలో ఆమె నటించిన కిక్(హిందీ) సినిమా భారతదేశంలో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఆమె నటీంచిన హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్(అన్నీ 2006లోనే విడుదలయ్యాయి.) సినిమాలు వరుసగా విజయం సాధించడం విశేషం.[3][4]

మూలాలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]