రాధే (హిందీ సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాధే
దర్శకత్వంప్రభుదేవా
స్క్రీన్ ప్లేఏసీ.ముగిల్
విజయ్ మౌర్య
నిర్మాతసోహైల్ ఖాన్
అతుల్ అగ్నిహోత్రి
సల్మాన్ ఖాన్
నిఖిల్ నమిత్
తారాగణంసల్మాన్‌ఖాన్‌
దిశా పటాని
జాకీ ష్రాఫ్
రణదీప్‌ హుడా
మేఘా ఆకాశ్‌[1]
ఛాయాగ్రహణంఆయనంక బోస్
కూర్పురితేష్ సోని
సంగీతంScore:
సంచిత్ బల్హార
అంకిత్ బల్హార
Songs:
సాజిద్‌వాజిద్
‌దేవిశ్రీ ప్రసాద్‌
హిమేశ్‌ రేష్మియా
నిర్మాణ
సంస్థలు
రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సోహాలి ఖాన్‌ ప్రొడక్షన్స్‌, సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ బ్యానర్
పంపిణీదార్లుజీ స్టూడియోస్
జీప్లెక్స్
జీ 5
విడుదల తేదీ
13 మే 2021 (2021-05-13)
దేశంభారతదేశం
భాషహిందీ

రాధే (యువ‌ర్ మోస్ట్ వాంటెడ్ భాయ్) 2021లో విడుదల కానున్న యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ హిందీ సినిమా. ఈ సినిమా సౌత్‌ కొరియన్‌ హిట్ 'వెటరన్‌'కు అఫీషియల్ రీమేక్. సల్మాన్ ఖాన్ హీరోగా, దిశా పటాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రణదీప్‌ హుడా, జాకీ ష్రాఫ్‌, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సోహాలి ఖాన్‌ ప్రొడక్షన్స్‌, సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించగా, సాజిద్‌వాజిద్‌, దేవిశ్రీ ప్రసాద్‌, హిమేశ్‌ రేష్మియా సంగీతం అందించారు.[2] ఈ సినిమా ట్రైల‌ర్ ఏప్రిల్ 22 న రిలీజ్ చేశారు.

సినిమా విడుదల

[మార్చు]

ఈ సినిమా రంజాన్ సందర్భంగా 2021 మే 13న జీ5 ఓటీటీకి చెందిన జీప్లెక్స్‌లో టికెట్‌ రుసుము చెల్లించి, డిష్‌, డీ2హెచ్‌, టాటా స్కై, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ వంటి డీటీహెచ్‌ వేదికల్లో ‘పే పర్‌ వ్యూ’ విధానంలో సినిమా విడుదల చేశారు.[3]

రానా (రణ్‌దీప్‌ హుడా) ముంబయిలో పెద్ద డ్రగ్‌ డీలర్‌. తన చీకటి వ్యాపారాన్ని నగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నంలో ఉంటాడు. ఇందుకోసం ఎలాంటి ఘాతుకానికైనా వెనుకాడడు. అతడిని అడ్డుకునేందుకు ముంబయి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించి విఫలమవుతారు. గుండె ధైర్యం, తెగింపు ఉన్న పోలీస్‌ ఆఫీసర్‌ కోసం వెతుకుతారు. అప్పుడు వారికి రాధే (సల్మాన్‌ఖాన్‌) కనిపిస్తాడు. అప్పటికే అతడిపై సస్పెన్షన్‌ వేటు ఉండటంతో దాన్ని ఎత్తేసి విధుల్లోకి తీసుకుంటారు. దీంతో రంగంలోకి దిగిన రాధే.. పని మొదలు పెడతాడు. మరి రానాను అడ్డుకునేందుకు రాధే చేపట్టిన మిషన్‌ ఏంటి? ఈ క్రమంలో దియా (దిశా పటానీ) ఎలా పరిచయం అయింది? చివరకు రాధే తన మిషన్‌ పూర్తి చేశాడా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Salman Khan is special because of this quality, reveals Megha Akash - Times of India". The Times of India.
  2. ఆంధ్రజ్యోతి (21 April 2021). "సల్మాన్ 'రాధే' రిలీజ్ డేట్ ఫిక్స్ ..!". Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.
  3. ఆంధ్రజ్యోతి (22 April 2021). "థియేటర్లలోనూ... డిజిటల్‌ తెరపైనా... ఒకే రోజున విడుదల!". www.andhrajyothy.com. Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.
  4. Eenadu (13 May 2021). "Radhe Review: రివ్యూ: రాధే - salman khan radhe movie review". www.eenadu.net. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  5. "Radhe: Disha Patani will joins Sulam Khan on Screen". Youth Press Pakistan. Youth Publishers. Archived from the original on 2021-05-03. Retrieved 2022-01-29.
  6. "Bharath to play Salman Khan's villain in 'Radhe'". The Times of India. 8 November 2019. Retrieved 22 April 2021.
  7. "Gautam Gulati on Salman Khan's Radhe: Can't thank God enough for this opportunity". The Indian Express. 24 November 2019. Retrieved 22 April 2021.
  8. "Telugu actor Narra Srinivas joins Salman Khan's Radhe: Got this offer through Prabhudheva sir". India Today. 1 December 2019. Retrieved 22 April 2021.
  9. "Govind Namdev joins Salman Khan's Radhe: I am working with him after a long gap". India Today. 13 December 2019. Retrieved 22 April 2021.
  10. "'Radhe: Your Most Wanted Bhai': Debutant actor Arjun Kanungo calls Salman Khan the only "star" in Bollywood - Times of India". 21 February 2020. Retrieved 22 April 2021.
  11. "Jacqueline Fernandez selected for an item song in Salman Khan's Radhe". India Today. 3 December 2019. Archived from the original on 19 డిసెంబరు 2019. Retrieved 22 April 2021.
  12. "Radhe: Jacqueline Fernandez to feature in an item song in Salman Khan starrer". Freepress. 3 December 2019. Retrieved 22 April 2021.