Jump to content

సుఖేశ్ చంద్రశేఖర్

వికీపీడియా నుండి
సుఖేశ్ చంద్రశేఖర్
జననం1989
బెంగళూరు, కర్ణాటక
ఇతర పేర్లుబాలాజీ
జీవిత భాగస్వామిలీనా మరియా పాల్ (m.2011)
తల్లిదండ్రులు
  • విజయన్ చంద్రశేఖర్ (తండ్రి)

ఆర్థిక నేరారోపణలు ఎదుర్కుంటున్న.సుఖేశ్ చంద్రశేఖర్(ఆంగ్లం: Sukesh Chandrasekhar)ని బాలాజీ అని కూడా పిలుస్తారు. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే సుఖేశ్ చంద్రశేఖర్ 17 సంవత్సరాల వయస్సు లోనే 2007లో వంద మందికి పైగా ప్రజలను మోసం చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు.

చదువు

[మార్చు]

సుఖేశ్ చంద్రశేఖర్ బెంగళూరులో జన్మించాడు. అక్కడే బిషప్స్ కాటన్ బాయ్స్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసాడు. మధురై యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు.

రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసు

[మార్చు]

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో సుఖేశ్‌ను దిల్లీ పోలీసులు 2021 ఆగస్టులో అరెస్టు చేసారు. తిహార్ జైలుకు తరలించారు కానీ అక్కడి నుంచి కూడా నేరాలకు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తులో వెల్లడైంది. జైలు గదిలో లగ్జరీ సదుపాయాలతో పాటు, మొబైల్‌ ఫోన్‌ వినియోగించుకునేందుకు అక్కడ సిబ్బందికి పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా అతన్ని కలవడానికి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహీతో పాటు పలువురు బాలీవుడ్‌ సెలెబ్రిటీలు వచ్చేవారని పేర్కొన్నారు.[1]

ఈ కేసు దర్యాప్తులో భాగంగా సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు చెందిన రూ.7 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అధికారులు 2022 ఏప్రిల్ 30న అటాచ్‌ చేసారు.[2] గతంలో విదేశాలకు వెళ్లకుండా ఆమెను ముంబై విమానాశ్రయంలో ఈడీ నిలిపివేసింది. పైగా 2021 డిసెంబర్ 8న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Sukesh Chandrasekhar: తిహాడ్‌ జైలు సిబ్బందికి ప్రతి నెలా రూ.కోటి లంచం". web.archive.org. 2022-05-01. Archived from the original on 2022-05-01. Retrieved 2022-05-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Jacqueline Fernandez: నటి జాక్వెలిన్‌కు ఈడీ షాక్‌.. రూ.7కోట్ల ఆస్తులు అటాచ్‌". web.archive.org. 2022-05-01. Archived from the original on 2022-05-01. Retrieved 2022-05-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Who is Sukesh Chandrasekhar? The Millionaire Conman Whose Cosy Pics With Jacqueline Fernandez Went Viral". web.archive.org. 2022-05-01. Archived from the original on 2022-05-01. Retrieved 2022-05-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)